Title (Indic)మాపు దాఁకానేల జోలి మంచివాఁడవే నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకానేల జోలి మంచివాఁడవే నీవు రాఁపుసేయకుండరాదా రామ గలసీని (॥మాపు॥) నేరుపుల కెంతలేదు నీవు మాటాలాడేనంటే మారుకొని వూఁకొనఁగ మాతరములా మేరతోడివాఁడ వౌదు మెచ్చితిమి నిన్నుఁ దొల్లె రారాదా యెందాఁక రమణి దిట్టీని (॥మాపు॥) ననుపులకుఁ గడమా నవ్వు నీవు నవ్వేనంటే ఘనము మరి పెంచఁగలమా నేము ఘనుఁడవు నీ వౌదువు కడమ నీయం దెంచము యెనయరాదా ఇంతి యెగ్గులువట్టీని (॥మాపు॥) వేడుకలకు వెలితా వియ్యములందేనంటే జాడతోడఁ గొసరేమా సారెకు నేము కూడితివి వనితలను గొబ్బున శ్రీవేంకటేశ తోడనే మోవియ్యరాదా తొయ్యలి వేఁడీని English(||pallavi||) mābu dām̐kānela joli maṁchivām̐ḍave nīvu rām̐puseyaguṁḍarādā rāma galasīni (||mābu||) nerubula kĕṁtaledu nīvu māḍālāḍenaṁṭe mārugŏni vūm̐kŏnam̐ga mādaramulā meradoḍivām̐ḍa vaudu mĕchchidimi ninnum̐ dŏllĕ rārādā yĕṁdām̐ka ramaṇi diṭṭīni (||mābu||) nanubulagum̐ gaḍamā navvu nīvu navvenaṁṭe ghanamu mari pĕṁcham̐galamā nemu ghanum̐ḍavu nī vauduvu kaḍama nīyaṁ dĕṁchamu yĕnayarādā iṁti yĕgguluvaṭṭīni (||mābu||) veḍugalagu vĕlidā viyyamulaṁdenaṁṭe jāḍadoḍam̐ gŏsaremā sārĕgu nemu kūḍidivi vanidalanu gŏbbuna śhrīveṁkaḍeśha toḍane moviyyarādā tŏyyali vem̐ḍīni