Title (Indic)మాపు దాఁకా యేమనిన మంకుదేరేవా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా యేమనిన మంకుదేరేవా తీపులు చల్లుక నీతో దెగడేదే నా పని (॥వప॥) చలము సాదించరాదు సణగులఁ దిట్టిరాదు వలచినదాన నిన్ను వంచుకోరాదు తెలివి దెచ్చుక నీతో తేటలుగా నవ్వునవ్వి కెలసి ఇచ్చకమాడి గెలిచేదే నాపని (॥వప॥) పెనఁగఁ దగదు నీతో బిగువు చూపఁదగదు నవిచినదాన నీతో నాలి దగదు మనసువట్టుక నీమర్మములు సోఁకించి చనవు సేసుకుండేది సంగతైన నాపని (॥వప॥) పొందుసేయ కిఁకఁ బోదు బోగించి మెచ్చకపోదు విందువంటిదాన మాట వినకపోదు కందువతోడుత శ్రీ వేంకటేశ నేఁ గూడితి యిందునే పాయకవుండి యెనసేదే నాపని English(||pallavi||) mābu dām̐kā yemanina maṁkuderevā tībulu salluga nīdo dĕgaḍede nā pani (||vaba||) salamu sādiṁcharādu saṇagulam̐ diṭṭirādu valasinadāna ninnu vaṁchugorādu tĕlivi dĕchchuga nīdo teḍalugā navvunavvi kĕlasi ichchagamāḍi gĕlisede nābani (||vaba||) pĕnam̐gam̐ dagadu nīdo biguvu sūbam̐dagadu navisinadāna nīdo nāli dagadu manasuvaṭṭuga nīmarmamulu som̐kiṁchi sanavu sesuguṁḍedi saṁgadaina nābani (||vaba||) pŏṁduseya kim̐kam̐ bodu bogiṁchi mĕchchagabodu viṁduvaṁṭidāna māḍa vinagabodu kaṁduvadoḍuda śhrī veṁkaḍeśha nem̐ gūḍidi yiṁdune pāyagavuṁḍi yĕnasede nābani