Title (Indic)మాపు దాఁకా విన్నపాలు మరియేఁటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా విన్నపాలు మరియేఁటికి పైపై నీదేవులౌటే భాగ్యమింతేకాక (॥మాపు॥) వలచినకాంత యీకె వాసు లెంచఁబనిలేదు చెలరేఁగి వినయము చేసుటగాని నిలువెల్లా దమకమే నీతో నెట్టలిగీని కలది నీవూడిగమే గతి ఇంతేకాక (॥మాపు॥) తగువైనసతి యీకె తప్పులు వట్టంగరదు అగపడి ఇచ్చకము లాడుటగాని మొగమోట దరచాయ మొక్కలాన దూరలేదు నిగిడి నీతో నవ్వుటే నేరు పింతేకాని (॥మాపు॥) కూడినమానిని యీపె గుంపెనలు చూపరాదు వేడుకఁ గాఁగిలిమ్మని వేఁడుటగాని యీడనె శ్రీవేంకటేశ యేలితివి నిన్నేమని జాడతోడ మోవేనుటే సరవితేకాక English(||pallavi||) mābu dām̐kā vinnabālu mariyem̐ṭigi paibai nīdevulauḍe bhāgyamiṁtegāga (||mābu||) valasinagāṁta yīgĕ vāsu lĕṁcham̐baniledu sĕlarem̐gi vinayamu sesuḍagāni niluvĕllā damagame nīdo nĕṭṭaligīni kaladi nīvūḍigame gadi iṁtegāga (||mābu||) taguvainasadi yīgĕ tappulu vaṭṭaṁgaradu agabaḍi ichchagamu lāḍuḍagāni mŏgamoḍa darasāya mŏkkalāna dūraledu nigiḍi nīdo navvuḍe neru piṁtegāni (||mābu||) kūḍinamānini yībĕ guṁpĕnalu sūbarādu veḍugam̐ gām̐gilimmani vem̐ḍuḍagāni yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi ninnemani jāḍadoḍa movenuḍe saravidegāga