Title (Indic)మాపు దాఁకా వట్టిజోలి మాతో నేఁటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా వట్టిజోలి మాతో నేఁటికి నీ పొందుల కిది వలె నేరుచుకోవయ్యా (॥మాపు॥) తెగరాని మాఁటలకు తెరువు కోపగించుట నగితేనే పెనగొను నాలితనము మొగము చూచితేనే మోహములెల్లా నిండు నిగిడి నీకేది వలె నేరుచుకోవయ్యా (॥మాపు॥) తీరనియలుకలకు తెరఁగు పంతమిచ్చుట వూరకుండితేనే నాయ ముమ్మళినుండు కూరిమి గొసరితేనే కుప్పవడు వలపులు నీరచన కేది వలె నేరుచుకోవయ్యా (॥మాపు॥) పట్టినవాలములకు పరిహరము మొక్కుటే గుట్టుతో నుంటే నన్నీఁ గొనసాగును ఇట్టె శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను నెట్టన నీ కేది వలె నేరుచుకోవయ్యా English(||pallavi||) mābu dām̐kā vaṭṭijoli mādo nem̐ṭigi nī pŏṁdula kidi valĕ nerusugovayyā (||mābu||) tĕgarāni mām̐ṭalagu tĕruvu kobagiṁchuḍa nagidene pĕnagŏnu nālidanamu mŏgamu sūsidene mohamulĕllā niṁḍu nigiḍi nīgedi valĕ nerusugovayyā (||mābu||) tīraniyalugalagu tĕram̐gu paṁtamichchuḍa vūraguṁḍidene nāya mummaḽinuṁḍu kūrimi gŏsaridene kuppavaḍu valabulu nīrasana kedi valĕ nerusugovayyā (||mābu||) paṭṭinavālamulagu pariharamu mŏkkuḍe guṭṭudo nuṁṭe nannīm̐ gŏnasāgunu iṭṭĕ śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu nĕṭṭana nī kedi valĕ nerusugovayyā