Title (Indic)మాపు దాఁకా సుద్దులేల మఱఁగు మొఱఁగులేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా సుద్దులేల మఱఁగు మొఱఁగులేల చేపట్టి నీ వింకఁ జేసినట్టు చేయరా (॥మాపు॥) వంపునీగోరిగుఱుతు వాఁసుకొన్నది నా మేన యింపులఁ గాచినది నీయింటివాకిలి ముంపున నాతురుము నీముంజేతి సేసలకే చెంప జారె నీ వింకఁ జేసినట్లు సేయరా (॥మాపు॥) యె త్తినవి నాచేతు లివె నీ మొక్కులకే పొత్తు నీకాఁగిటికి నావూఁపచన్నులు హత్తిన నాజవ్వనమంతా నీకే మీఁదు చిత్తగించి నీవింకఁ జెసినట్టు సేయరా (॥మాపు॥) యిచ్చితివి నీరూపు యిదె నామతికి దక్క వచ్చితివి నేఁడు నావద్దకి నీవు యిచ్చగించి శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి చెచ్చెర నేమైనా నింకఁ జేసినట్టు సేయరా English(||pallavi||) mābu dām̐kā suddulela maṟam̐gu mŏṟam̐gulela sebaṭṭi nī viṁkam̐ jesinaṭṭu seyarā (||mābu||) vaṁpunīgoriguṟudu vām̐sugŏnnadi nā mena yiṁpulam̐ gāsinadi nīyiṁṭivāgili muṁpuna nādurumu nīmuṁjedi sesalage sĕṁpa jārĕ nī viṁkam̐ jesinaṭlu seyarā (||mābu||) yĕ ttinavi nāsedu livĕ nī mŏkkulage pŏttu nīgām̐giḍigi nāvūm̐pasannulu hattina nājavvanamaṁtā nīge mīm̐du sittagiṁchi nīviṁkam̐ jĕsinaṭṭu seyarā (||mābu||) yichchidivi nīrūbu yidĕ nāmadigi dakka vachchidivi nem̐ḍu nāvaddagi nīvu yichchagiṁchi śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi sĕchchĕra nemainā niṁkam̐ jesinaṭṭu seyarā