Title (Indic)మాపు దాఁకా రేపకాడ మానఁజాల మింతే కాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా రేపకాడ మానఁజాల మింతే కాక పూపల నీ మతకము పుట్టించరానిది (॥మాపు॥) చేతికి విడె మియ్యఁగ సేసలెల్లాఁ జేయఁగాను ఆతల నున్న మనసు యీతల నాయ యీతీరు నీరాతిగుణ మెందాఁకాఁ దిప్పఁగ వచ్చు నీతితోడ నీవలపు నీయంత లేనిది (॥మాపు॥) కన్నులెదుట నుండఁగ కవకవనవ్వఁగాను మన్నించి నీవాకున మాట వెళ్లెను పన్నుకొని నీతో నెట్టు బయలు వాఁకఁగ వచ్చు పిన్న నాఁడు లేనివోజ పెద్దై తే నుండునా (॥మాపు॥) కందువకుఁ దియ్యంగాను కాఁగిట బిగించఁగాను విందుల కూటమి వెల్ల విరు లాయను అందపు శ్రీవేంకటేశ ఆలయించ నెట్టు వచ్చు ముందువెనకల నిఁక మూసి దాఁచఁదగునా English(||pallavi||) mābu dām̐kā rebagāḍa mānam̐jāla miṁte kāga pūbala nī madagamu puṭṭiṁcharānidi (||mābu||) sedigi viḍĕ miyyam̐ga sesalĕllām̐ jeyam̐gānu ādala nunna manasu yīdala nāya yīdīru nīrādiguṇa mĕṁdām̐kām̐ dippam̐ga vachchu nīdidoḍa nīvalabu nīyaṁta lenidi (||mābu||) kannulĕduḍa nuṁḍam̐ga kavagavanavvam̐gānu manniṁchi nīvāguna māḍa vĕḽlĕnu pannugŏni nīdo nĕṭṭu bayalu vām̐kam̐ga vachchu pinna nām̐ḍu lenivoja pĕddai te nuṁḍunā (||mābu||) kaṁduvagum̐ diyyaṁgānu kām̐giḍa bigiṁcham̐gānu viṁdula kūḍami vĕlla viru lāyanu aṁdabu śhrīveṁkaḍeśha ālayiṁcha nĕṭṭu vachchu muṁduvĕnagala nim̐ka mūsi dām̐sam̐dagunā