Title (Indic)మాపు దాఁకా రేపకాడ మాటకు మాటాడఁగాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా రేపకాడ మాటకు మాటాడఁగాను యేపునఁ దెగని పనికేల పెట్టే వాన (॥మాపు॥) నవ్వి నవ్వి మానేవు నడుమ నడుమ నీవు జవ్వని యెవ్వతేమైనా సన్న సేసెనా వువ్విళ్లూర నీనిజము వొరసి చూచే నింతే యెవ్వరిందుకు గురయ్యే రేల పెట్టే వాన (॥మాపు॥) చెప్పి చెప్పి కొంకేవు సిగ్గులువడుతా నీవు వుప్పటించ నీడ నెవ్వరున్నారు నీకు రెప్పలెత్తి చూచి నిన్ను రేఁచి వెదకే నింతే యెప్పటివాఁడవే నీవు యేల పెట్టే వాన (॥మాపు॥) ముట్టి ముట్టి చూచేవు మొరఁగి నాకుచములు యిట్టె యెవ్వతెవైనా యీడువచ్చెనా నెట్టన శ్రీవేంకటేశ నిరతి మెచ్చితి నింతే యెట్టకేల కైనపనికేల పెట్టే వాన English(||pallavi||) mābu dām̐kā rebagāḍa māḍagu māḍāḍam̐gānu yebunam̐ dĕgani panigela pĕṭṭe vāna (||mābu||) navvi navvi mānevu naḍuma naḍuma nīvu javvani yĕvvademainā sanna sesĕnā vuvviḽlūra nīnijamu vŏrasi sūse niṁte yĕvvariṁdugu gurayye rela pĕṭṭe vāna (||mābu||) sĕppi sĕppi kŏṁkevu sigguluvaḍudā nīvu vuppaḍiṁcha nīḍa nĕvvarunnāru nīgu rĕppalĕtti sūsi ninnu rem̐si vĕdage niṁte yĕppaḍivām̐ḍave nīvu yela pĕṭṭe vāna (||mābu||) muṭṭi muṭṭi sūsevu mŏram̐gi nāgusamulu yiṭṭĕ yĕvvadĕvainā yīḍuvachchĕnā nĕṭṭana śhrīveṁkaḍeśha niradi mĕchchidi niṁte yĕṭṭagela kainabanigela pĕṭṭe vāna