Title (Indic)మాపు దాఁకా నేమిచెప్పే మఱియును నేనిఁక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా నేమిచెప్పే మఱియును నేనిఁక ఆ పనికి లోనైవుండుటది మేలు నాకు (॥॥) ప్రియపడి నీతో నింత పెనఁగ నే మున్నది నయగారిమాటలకు నగుతగాక నియతాన నడవఁగా నీకు బుద్ది చెప్పేనా అయినట్టయిన నీవుండు టదిమేలు నాకు (॥॥) సారెసారె నే నిన్ను సాదించఁగా నేమివచ్చీ మేరతో నీచేఁతలెల్లా మొచ్చుటగాక వోరలేక వండఁగాను వొడఁబరచవచ్చేనా ఆరతి నీ యిచ్చనుండు టదిమేలు నాకు (॥॥) శ్రీవేంకటేశ నీతోడ సిగ్గువడఁ బనియేమి భావించి నిన్నుఁ గూడుటే పంతముగాక నీవొళ్ళ లేనిగుణము నేఁ జెసిపెట్టేనా ఆవటించి నమ్మివుండు టదిమేలు నాకు English(||pallavi||) mābu dām̐kā nemisĕppe maṟiyunu nenim̐ka ā panigi lonaivuṁḍuḍadi melu nāgu (||||) priyabaḍi nīdo niṁta pĕnam̐ga ne munnadi nayagārimāḍalagu nagudagāga niyadāna naḍavam̐gā nīgu buddi sĕppenā ayinaṭṭayina nīvuṁḍu ṭadimelu nāgu (||||) sārĕsārĕ ne ninnu sādiṁcham̐gā nemivachchī merado nīsem̐talĕllā mŏchchuḍagāga voralega vaṁḍam̐gānu vŏḍam̐barasavachchenā āradi nī yichchanuṁḍu ṭadimelu nāgu (||||) śhrīveṁkaḍeśha nīdoḍa sigguvaḍam̐ baniyemi bhāviṁchi ninnum̐ gūḍuḍe paṁtamugāga nīvŏḽḽa leniguṇamu nem̐ jĕsibĕṭṭenā āvaḍiṁchi nammivuṁḍu ṭadimelu nāgu