Title (Indic)మాపు దాఁకా నేల నీ మనసు వచ్చితేఁ జాలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా నేల నీ మనసు వచ్చితేఁ జాలు చేపట్టిన పని నీ చిత్తమే యెఱుఁగును (॥వప॥) మంతనాన నీ వాడినమాటలుగా నామతిలో యెంతైనా నీపైకోపము హెచ్చనీనివి పంతము నాకేమి దప్పెఁ బదవయ్య నీవు నన్ను యింత వేడుకొనఁగా నే నియ్యకొన కుండీనా (॥వప॥) అప్పుడు నీవు చూచిన ఆసల చూపులే కా దెప్పరమై నీమీఁదఁ దెగనీనివి యిప్పుడె వేగిరమేల యింత నీవు బాఁతి పడి చెప్పేటి నీప్రియములు చేకొనకుండేనా (॥వప॥) పెక్కురతులను నన్నుఁ బెనచే యీ కాఁగిలే కా తక్కక నీపై వలపు తమి రేఁచేది యిక్కువలంటి శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి దక్కితి నిఁక నీమేలు తలఁచకుండేనా English(||pallavi||) mābu dām̐kā nela nī manasu vachchidem̐ jālu sebaṭṭina pani nī sittame yĕṟum̐gunu (||vaba||) maṁtanāna nī vāḍinamāḍalugā nāmadilo yĕṁtainā nībaigobamu hĕchchanīnivi paṁtamu nāgemi dappĕm̐ badavayya nīvu nannu yiṁta veḍugŏnam̐gā ne niyyagŏna kuṁḍīnā (||vaba||) appuḍu nīvu sūsina āsala sūbule kā dĕpparamai nīmīm̐dam̐ dĕganīnivi yippuḍĕ vegiramela yiṁta nīvu bām̐ti paḍi sĕppeḍi nīpriyamulu segŏnaguṁḍenā (||vaba||) pĕkkuradulanu nannum̐ bĕnase yī kām̐gile kā takkaga nībai valabu tami rem̐sedi yikkuvalaṁṭi śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi dakkidi nim̐ka nīmelu talam̐saguṁḍenā