Title (Indic)మాపు దాఁకా మాతోడి(డ?) మాటలేఁటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా మాతోడి(డ?) మాటలేఁటికి తీపులఁ బెట్టి యాపె తెమలించీ నిన్నును (॥మాపు॥) మనసు వచ్చిన మాట మరి విన నింపౌను చనవు గలుగు మాట చవివుట్టును వినయము తోటి మాట వేడుకలు కడు రేఁచు వినవయ్య నీకు నేఁడు విన్నవించీ నాకె (॥మాపు॥) వొడఁబాటైన మాట వుల్లము గరఁగఁజేయు వుడివోనిమేలుమాట వొద్దికైవుండు అడియాలమైనమాట ఆసలెల్లాఁ బొడమించు విడువని తమకాన విన్నవించీనాకె (॥మాపు॥) తారుకాణలైనమాట తలఁపించు మర్మములు నేరుపుతోడిమాట నించు వలపు యీరీతి శ్రీ వేంకటేశ యేలితివి నన్నునేఁడు చేరి చేరి కాఁగిలించి చెప్పి చూపీ నాకె English(||pallavi||) mābu dām̐kā mādoḍi(ḍa?) māḍalem̐ṭigi tībulam̐ bĕṭṭi yābĕ tĕmaliṁchī ninnunu (||mābu||) manasu vachchina māḍa mari vina niṁpaunu sanavu galugu māḍa savivuṭṭunu vinayamu toḍi māḍa veḍugalu kaḍu rem̐su vinavayya nīgu nem̐ḍu vinnaviṁchī nāgĕ (||mābu||) vŏḍam̐bāḍaina māḍa vullamu garam̐gam̐jeyu vuḍivonimelumāḍa vŏddigaivuṁḍu aḍiyālamainamāḍa āsalĕllām̐ bŏḍamiṁchu viḍuvani tamagāna vinnaviṁchīnāgĕ (||mābu||) tārugāṇalainamāḍa talam̐piṁchu marmamulu nerubudoḍimāḍa niṁchu valabu yīrīdi śhrī veṁkaḍeśha yelidivi nannunem̐ḍu seri seri kām̐giliṁchi sĕppi sūbī nāgĕ