Title (Indic)మాపు దాఁకా మాటలేల మాతోఁ జాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా మాటలేల మాతోఁ జాల పైపై నున్నది నీపై నిదెవోలా (॥మాపు॥) చెలిఁ గొంగువట్టి తీసి చేయిమీదఁ జేయివేసి యెలమి వలపురేఁచే వెగపోసి మెలుపునఁ జందురుఁడు మీమీఁద వెన్నెల గానీ కలయరాదావిభుఁడ కలికిని డాసి (॥మాపు॥) మగువయిల్లు చొచ్చి మచ్చికలఁ జనవచ్చి నగవులునవ్వేవు నడుమఁ గొచ్చి పగటున వలరాచలబలము పౌఁజులై వచ్చీ జగడము మానరాదా జవరాలిమెచ్చి (॥మాపు॥) రమణిఁగాగిఁ గూడిరతులనే వసివాడి తమితోమన్నించితివి తగు నీవాడి నమమై శ్రీవేంకటేశ చల్లగాలి విసరాడీ చెమట లార్చుకోరాదా సిగ్గులువీడి English(||pallavi||) mābu dām̐kā māḍalela mādom̐ jāla paibai nunnadi nībai nidĕvolā (||mābu||) sĕlim̐ gŏṁguvaṭṭi tīsi seyimīdam̐ jeyivesi yĕlami valaburem̐se vĕgabosi mĕlubunam̐ jaṁdurum̐ḍu mīmīm̐da vĕnnĕla gānī kalayarādāvibhum̐ḍa kaligini ḍāsi (||mābu||) maguvayillu sŏchchi machchigalam̐ janavachchi nagavulunavvevu naḍumam̐ gŏchchi pagaḍuna valarāsalabalamu paum̐julai vachchī jagaḍamu mānarādā javarālimĕchchi (||mābu||) ramaṇim̐gāgim̐ gūḍiradulane vasivāḍi tamidomanniṁchidivi tagu nīvāḍi namamai śhrīveṁkaḍeśha sallagāli visarāḍī sĕmaḍa lārsugorādā sigguluvīḍi