Title (Indic)మాపు దాఁకా జోలి యేల మనసొక్కటాయ నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా జోలి యేల మనసొక్కటాయ నేఁడు యే పొద్దుదాఁకాఁ జెప్పే వియ్యకొంటి రావయ్యా (॥వప॥) చెలరేఁగి రమణుఁడు చెక్కు నొక్కి వేఁడుకోఁగా చలపాదితన మేల, సకియకును అలుకలెల్లాఁ దీరి ఆసతోడఁ బెనఁగఁగ కలిగినపాటే మేలు కైకొంటి రావయ్యా (॥వప॥) సేనలు వెట్టినవాఁడు చేరి వొడఁబరచఁగ వాసితోఁ గొసరనేల వనితకును వేసరక వూడిగాలు వెస నేపొద్దుఁ జేయఁగా యేసేఁతలై నా మేలు యెదురాడవయ్యా (॥వప॥) శ్రీవెంటేశ్వర చిత్తగించి నీవేలఁగా వావు లడుగనేల నావంటిదానికి భావములోపల నమ్మి పైకొని భోగించఁగాను దేవులనౌటే మేలు తెలిసితి రావయ్యా English(||pallavi||) mābu dām̐kā joli yela manasŏkkaḍāya nem̐ḍu ye pŏddudām̐kām̐ jĕppe viyyagŏṁṭi rāvayyā (||vaba||) sĕlarem̐gi ramaṇum̐ḍu sĕkku nŏkki vem̐ḍugom̐gā salabādidana mela, sagiyagunu alugalĕllām̐ dīri āsadoḍam̐ bĕnam̐gam̐ga kaliginabāḍe melu kaigŏṁṭi rāvayyā (||vaba||) senalu vĕṭṭinavām̐ḍu seri vŏḍam̐barasam̐ga vāsidom̐ gŏsaranela vanidagunu vesaraga vūḍigālu vĕsa nebŏddum̐ jeyam̐gā yesem̐talai nā melu yĕdurāḍavayyā (||vaba||) śhrīvĕṁṭeśhvara sittagiṁchi nīvelam̐gā vāvu laḍuganela nāvaṁṭidānigi bhāvamulobala nammi paigŏni bhogiṁcham̐gānu devulanauḍe melu tĕlisidi rāvayyā