Title (Indic)మాపు దాఁకా జోలి యేల మానఁగదవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా జోలి యేల మానఁగదవే చేపట్టి యాతఁడు నా చిత్తములోఁ బాయఁడు (॥మాపు॥) అతనిపై తమకము ఆఁపఁగలేనే యితవుగా నీ బుద్దులు యేమి చెప్పేవే మితిమీరి యతనికి మేలుదాననే చతురత నీ మాఁటలు చవులుగావే (॥మాపు॥) మలసి యాతని పొందు మానఁగరాదే వెలయఁగ నీవెంత వేఁడకొనేవే వలపుగాదని తోయవచ్చునటవే పలుమారు నాతో నేల పట్టి పెనఁగేవే (॥మాపు॥) మన సాతనిపైఁ బెట్టి మరిగితినే నను గిలిగించే యేమి నవ్వించేవే యెనసె శ్రీవేంకటేశుఁ డిదివో నన్ను మొనసి యెన్నేసి నీవు మొక్కులు మొక్కేవే English(||pallavi||) mābu dām̐kā joli yela mānam̐gadave sebaṭṭi yādam̐ḍu nā sittamulom̐ bāyam̐ḍu (||mābu||) adanibai tamagamu ām̐pam̐galene yidavugā nī buddulu yemi sĕppeve midimīri yadanigi meludānane sadurada nī mām̐ṭalu savulugāve (||mābu||) malasi yādani pŏṁdu mānam̐garāde vĕlayam̐ga nīvĕṁta vem̐ḍagŏneve valabugādani toyavachchunaḍave palumāru nādo nela paṭṭi pĕnam̐geve (||mābu||) mana sādanibaim̐ bĕṭṭi marigidine nanu giligiṁche yemi navviṁcheve yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍidivo nannu mŏnasi yĕnnesi nīvu mŏkkulu mŏkkeve