Title (Indic)మాపు దాఁకా జోలి మరి యేఁటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపు దాఁకా జోలి మరి యేఁటికి కోపుల మీరెను కొసరులు (॥మాపు॥) సరివచ్చె నేఁడు సతికి నీకును సిరుల నవ్వుల సెలవులు పొరుగుకు వచ్చె పొద్దున మీకిదె గరగరికెల కరఁగులు (॥మాపు॥) చొప్పణఁగె నేఁడు సుదతికి నీకు తప్పక చూచేవి తడవులు ముప్పిరి గొనెను మోహము లోననే కొప్పులు జారి గురుతులు (॥మాపు॥) తగవులఁ బెట్టీ తరుణికి నీకు బిగువు కాఁగిటి పెనఁగులు జిగిఁ గూడితిరి శ్రీ వెంకటేశుఁడ తగులాయ మీతలఁపులు English(||pallavi||) mābu dām̐kā joli mari yem̐ṭigi kobula mīrĕnu kŏsarulu (||mābu||) sarivachchĕ nem̐ḍu sadigi nīgunu sirula navvula sĕlavulu pŏrugugu vachchĕ pŏdduna mīgidĕ garagarigĕla karam̐gulu (||mābu||) sŏppaṇam̐gĕ nem̐ḍu sudadigi nīgu tappaga sūsevi taḍavulu muppiri gŏnĕnu mohamu lonane kŏppulu jāri gurudulu (||mābu||) tagavulam̐ bĕṭṭī taruṇigi nīgu biguvu kām̐giḍi pĕnam̐gulu jigim̐ gūḍidiri śhrī vĕṁkaḍeśhum̐ḍa tagulāya mīdalam̐pulu