Title (Indic)మాపై నింత కరుణైతే మంచిదాయను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపై నింత కరుణైతే మంచిదాయను చూపుల నీ పాటి నన్నుఁ జూచితివిగా (॥మాపై॥) నీవు గలిగియుండఁగా నివ్వెఱఁగేల చేవ దేరి యుండఁగాను చిన్నఁబో నేల కావరాన న న్నేల గరిసించేవు యీ విధి బుజ్జగించ నీ కేమౌదు నేను (॥మాపై॥) చేరి నీవుఁవే డుకోఁగా చెక్కు చే యాల గారవించఁగా నాకు కన్నీ రేల వూరకే న న్నేల యింక వొడి వట్టేవు నారుకొన్నసతులు శానలు గారా నీకు (॥మాపై॥) కౌఁగిట నీవు గూడ గా కాంతాళ మేల మాఁగినమో వియ్యఁగా మారాడ నేల దాఁగినఁ బోనీక నన్ను దక్కఁ గొంటివి పాఁగిన శ్రీవేంకటేశ పంతమింత వలెనా English(||pallavi||) mābai niṁta karuṇaide maṁchidāyanu sūbula nī pāḍi nannum̐ jūsidivigā (||mābai||) nīvu galigiyuṁḍam̐gā nivvĕṟam̐gela seva deri yuṁḍam̐gānu sinnam̐bo nela kāvarāna na nnela garisiṁchevu yī vidhi bujjagiṁcha nī kemaudu nenu (||mābai||) seri nīvum̐ve ḍugom̐gā sĕkku se yāla gāraviṁcham̐gā nāgu kannī rela vūrage na nnela yiṁka vŏḍi vaṭṭevu nārugŏnnasadulu śhānalu gārā nīgu (||mābai||) kaum̐giḍa nīvu gūḍa gā kāṁtāḽa mela mām̐ginamo viyyam̐gā mārāḍa nela dām̐ginam̐ bonīga nannu dakkam̐ gŏṁṭivi pām̐gina śhrīveṁkaḍeśha paṁtamiṁta valĕnā