Title (Indic)మాపై నింత కరుణైతే మంచిదాయను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాపై నింత కరుణైతే మంచిదాయను చూపుల నీపాటి నన్నుఁ జూచితివి గా (॥మాపై॥) నీవు గలిగి వుండఁగా నివ్వెర గేల చేవదేరి వుండఁగాను చిన్నఁబో నేల కావిరి న న్నేల యింత గరిసించేవు యీవిధి బుజ్జగించ నీకే మౌదు నేను (॥మాపై॥) చేరి నీవు వేఁడుకోఁగా చెక్కుచే యేల గారవించఁగాను నాకుఁ గన్నీ రేల వూరకే న న్నేల యింకా నొడి వట్టేవు నారుకొన్నసతులు శేనలు గారా (॥మాపై॥) కాఁగిట నీవు గూడఁగా కాఁతళ మేల మాఁగినమో వియ్యంగాను మారాడ నేల దాఁగినాఁ బోనిక నన్ను దక్కఁ గొంటివి పొఁగినశ్రీ వేంకటేశ పంత మింత వలెనా English(||pallavi||) mābai niṁta karuṇaide maṁchidāyanu sūbula nībāḍi nannum̐ jūsidivi gā (||mābai||) nīvu galigi vuṁḍam̐gā nivvĕra gela sevaderi vuṁḍam̐gānu sinnam̐bo nela kāviri na nnela yiṁta garisiṁchevu yīvidhi bujjagiṁcha nīge maudu nenu (||mābai||) seri nīvu vem̐ḍugom̐gā sĕkkuse yela gāraviṁcham̐gānu nāgum̐ gannī rela vūrage na nnela yiṁkā nŏḍi vaṭṭevu nārugŏnnasadulu śhenalu gārā (||mābai||) kām̐giḍa nīvu gūḍam̐gā kām̐taḽa mela mām̐ginamo viyyaṁgānu mārāḍa nela dām̐ginām̐ boniga nannu dakkam̐ gŏṁṭivi pŏm̐ginaśhrī veṁkaḍeśha paṁta miṁta valĕnā