Title (Indic)మా యింటికిఁ దానే వచ్చి మన్నించుఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మా యింటికిఁ దానే వచ్చి మన్నించుఁ గాక సేయఁగల విన్నపాలు సేసేదేమే (॥॥) సేసవెట్టి యేలినాఁ డు చేరి బాసలిచ్చినాడు లాసి మాటలాడినాఁడు లాలించినాఁడు ఆసలెల్లాఁ జూపినాఁడు ఆలిఁ జేసుకొన్నవాఁడు వేసరించి ఇఁకనేమి వేఁడుకొనేదేమే (॥॥) మనసుమర్మా లెఱుఁ గు మరి నావలపెరుఁగు తనువుపైతఁ(త్య) మెరుఁగు తగవెరుఁగు ననిచినపొందెరుఁగు నాఁటుకొన్నచూ పెరుఁగు పెనఁగి యింకా నేను ప్రేమ రేఁచేదేమే (॥॥) మనుపనే ననుఁ జూచె మొక్కినమొక్కులు చూచె తనగురుతులు చూచె దయఁ జూచె యెనసె శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను చెనకి ఇంకాఁ దనకుఁ జెప్పేటిదేమే English(||pallavi||) mā yiṁṭigim̐ dāne vachchi manniṁchum̐ gāga seyam̐gala vinnabālu sesedeme (||||) sesavĕṭṭi yelinām̐ ḍu seri bāsalichchināḍu lāsi māḍalāḍinām̐ḍu lāliṁchinām̐ḍu āsalĕllām̐ jūbinām̐ḍu ālim̐ jesugŏnnavām̐ḍu vesariṁchi im̐kanemi vem̐ḍugŏnedeme (||||) manasumarmā lĕṟum̐ gu mari nāvalabĕrum̐gu tanuvubaidam̐(tya) mĕrum̐gu tagavĕrum̐gu nanisinabŏṁdĕrum̐gu nām̐ṭugŏnnasū pĕrum̐gu pĕnam̐gi yiṁkā nenu prema rem̐sedeme (||||) manubane nanum̐ jūsĕ mŏkkinamŏkkulu sūsĕ tanagurudulu sūsĕ dayam̐ jūsĕ yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu sĕnagi iṁkām̐ danagum̐ jĕppeḍideme