Title (Indic)మా యింటికి విచ్చేసిన మన్నన యిది చాలదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మా యింటికి విచ్చేసిన మన్నన యిది చాలదా యేయెడనుండి వచ్చిన నెరవు సేసేమా (॥మాయింటి॥) కప్పురపుఁ జూపులు ఆకాంత నీపైఁ జల్లఁగాను వుప్పతిల్ల వెన్నెల నవ్వులు చల్లేవు చప్పుడుసేయక యింకఁ జల్లఁగా బదుకరయ్య యెప్పుడు నీవారమె నే మెరవుసేసేమా (॥మాయింటి॥) వేడుకమాటల నాపె విందునీకుఁ బెట్టఁగాను యీడనె వలపుసొమ్ము లియ్యఁ జూచేవు యీడుజోడుగూడుక మీరిద్దరు బదుకరయ్య యేడసుద్ది మిమ్ము నేము యెరవుసేసేమా (॥మాయింటి॥) అలమేలుమంగ నీకు నాసలుగానుకియ్యఁగ కలిమి శ్రీవెంకటేశ కప్ప మిచ్చేవు మెలఁగి వొకరొకరు మీ రిట్టె బదుకరయ్య యెలమి నన్నుఁ గూడితి వెరవుసేసేమా English(||pallavi||) mā yiṁṭigi vichchesina mannana yidi sāladā yeyĕḍanuṁḍi vachchina nĕravu sesemā (||māyiṁṭi||) kappurabum̐ jūbulu āgāṁta nībaim̐ jallam̐gānu vuppadilla vĕnnĕla navvulu sallevu sappuḍuseyaga yiṁkam̐ jallam̐gā badugarayya yĕppuḍu nīvāramĕ ne mĕravusesemā (||māyiṁṭi||) veḍugamāḍala nābĕ viṁdunīgum̐ bĕṭṭam̐gānu yīḍanĕ valabusŏmmu liyyam̐ jūsevu yīḍujoḍugūḍuga mīriddaru badugarayya yeḍasuddi mimmu nemu yĕravusesemā (||māyiṁṭi||) alamelumaṁga nīgu nāsalugānugiyyam̐ga kalimi śhrīvĕṁkaḍeśha kappa michchevu mĕlam̐gi vŏgarŏgaru mī riṭṭĕ badugarayya yĕlami nannum̐ gūḍidi vĕravusesemā