Title (Indic)మా పొందు సేయుమా మచ్చికలతోడ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మా పొందు సేయుమా మచ్చికలతోడ ఆ పనిఁ దిరుగఁగా నదవదలాయ (॥॥) మందమగువలు మాటలాడుకోఁగా కందువల నీకుఁ గతలాయ సందడించి పైఁ పైఁ జల్ల లమ్మఁగా చిందుచు నీమేన జిరుకులాయ (॥॥) నటన నందరును నవ్వులు నవ్వఁగా గుటుక నీమోవి గురులాయ తటకున లోలోఁ దనువు లంటఁ గా జొటజొటఁ జెమటలు చొతుకులాయ (॥॥) చెలరేఁగి యందరు సేవలు సేయఁగ కలిమాయ శ్రీ వేంకటవిభుఁడా అలమేలుమంగనై ఆయము లంటఁగా బలిమి వేడుకల గొబ్బనఁ బదనాయ English(||pallavi||) mā pŏṁdu seyumā machchigaladoḍa ā panim̐ dirugam̐gā nadavadalāya (||||) maṁdamaguvalu māḍalāḍugom̐gā kaṁduvala nīgum̐ gadalāya saṁdaḍiṁchi paim̐ paim̐ jalla lammam̐gā siṁdusu nīmena jirugulāya (||||) naḍana naṁdarunu navvulu navvam̐gā guḍuga nīmovi gurulāya taḍaguna lolom̐ danuvu laṁṭam̐ gā jŏḍajŏḍam̐ jĕmaḍalu sŏdugulāya (||||) sĕlarem̐gi yaṁdaru sevalu seyam̐ga kalimāya śhrī veṁkaḍavibhum̐ḍā alamelumaṁganai āyamu laṁṭam̐gā balimi veḍugala gŏbbanam̐ badanāya