Title (Indic)మా మనసేల సోదించి మాటలాడించేవు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మా మనసేల సోదించి మాటలాడించేవు నీవు నీ మన సెఱఁగనిది నేము చెప్పేమా (॥వమ॥) వాడికైనయాపె నిన్ను వలపించుకుండఁగాను వేడుకకత్తెలకేల వెంగెమాడను జాడతోడ నేమూ నిట్టె సంతోసించవలెఁగాక పాడిఁబంతా లెంచి తేను పచ్చిదేరదా (॥వమ॥) మచ్చికైనయాపె నీతో మంతనములాడఁగాను యిచ్చకురాండ్లకేల యీసురేఁగను మెచ్చిమెచ్చి యాపొందే నీమెడఁ గట్టుదుముగాక విచ్చి చెప్పఁ బోతేను వేసటగాదా (॥వమ॥) రతివేళ నాపె నిన్ను రాఁపు లింత సేయఁగాను సతమైనవారికేల జంకిచను తతి నలమేలుమంగపతివి శ్రీవేంకటేశ యితవై నన్నేలితివి యిది గొత్తగాదా English(||pallavi||) mā manasela sodiṁchi māḍalāḍiṁchevu nīvu nī mana sĕṟam̐ganidi nemu sĕppemā (||vama||) vāḍigainayābĕ ninnu valabiṁchuguṁḍam̐gānu veḍugagattĕlagela vĕṁgĕmāḍanu jāḍadoḍa nemū niṭṭĕ saṁtosiṁchavalĕm̐gāga pāḍim̐baṁtā lĕṁchi tenu pachchideradā (||vama||) machchigainayābĕ nīdo maṁtanamulāḍam̐gānu yichchagurāṁḍlagela yīsurem̐ganu mĕchchimĕchchi yābŏṁde nīmĕḍam̐ gaṭṭudumugāga vichchi sĕppam̐ bodenu vesaḍagādā (||vama||) radiveḽa nābĕ ninnu rām̐pu liṁta seyam̐gānu sadamainavārigela jaṁkisanu tadi nalamelumaṁgabadivi śhrīveṁkaḍeśha yidavai nannelidivi yidi gŏttagādā