Title (Indic)మా మాట వినవె కొంత మన్నించి నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మా మాట వినవె కొంత మన్నించి నీవు నీ మనసు కోరికల నేరుపులలోనా (॥మామాట॥) మొక్కకువె నిన్నతఁడు మొగము చూచినదాఁక గుక్కుచు నింతుల పెద్దకొలువులోన పెక్కుమాట లాడకువె పేరఁ బిలిచినదాఁక అక్కరైన సరసపుటాసలలోన (॥మామాట॥) కేరి నవ్వకువె తానె కేలు పయిచాఁచినదాఁక సారమైన వలపుల సందడిలోన ఆరసి చూడకువె నిన్నాయము లంటినదాఁక బీరపు తమకముల పెనఁగులలోన (॥మామాట॥) కొసరకువె యాతఁడు గొబ్బునఁ గూడినదాఁక ముసగసల యాకతముల మీలోన యెసగి శ్రీవెంకటేశుఁడ డిదివో నిన్నుఁ గలసె ఆసురుసురుగాకు నెయ్యములలోన English(||pallavi||) mā māḍa vinavĕ kŏṁta manniṁchi nīvu nī manasu korigala nerubulalonā (||māmāḍa||) mŏkkaguvĕ ninnadam̐ḍu mŏgamu sūsinadām̐ka gukkusu niṁtula pĕddagŏluvulona pĕkkumāḍa lāḍaguvĕ peram̐ bilisinadām̐ka akkaraina sarasabuḍāsalalona (||māmāḍa||) keri navvaguvĕ tānĕ kelu payisām̐sinadām̐ka sāramaina valabula saṁdaḍilona ārasi sūḍaguvĕ ninnāyamu laṁṭinadām̐ka bīrabu tamagamula pĕnam̐gulalona (||māmāḍa||) kŏsaraguvĕ yādam̐ḍu gŏbbunam̐ gūḍinadām̐ka musagasala yāgadamula mīlona yĕsagi śhrīvĕṁkaḍeśhum̐ḍa ḍidivo ninnum̐ galasĕ āsurusurugāgu nĕyyamulalona