Title (Indic)మా మాట వినఁగదవే మంకు లేఁటికే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మా మాట వినఁగదవే మంకు లేఁటికే కామునమ్ములకు గుఱిగా నిలువ వసమా (॥॥) చెక్కు నొక్కి వేఁడుకొని చేయి చేతఁబట్టు కొని మక్కువ చల్లిఁ బతితో మాటలాడవే లక్కవంటిది మనసు లాలించీ నాతఁడు నిన్ను గక్కన నింతట నైనా గరఁగఁగ వలదా (॥॥) వొడి వట్టి పెనఁగుతా నొడఁ బరచుకొంటాను తొడరేటి నీ మగని తోడ నగవే విడువ రాదు వలపు వీడె మిచ్చీ నాతఁడు అడియాలమై చేవట్టి ఆదరించవలదా (॥॥) వావులు నీకుఁ జెప్పీ వడి సరసము లాడీ శ్రీ వేంకటేశుని రతిఁ జెందఁ గదవే దేవి నలమేల్మంగవు తేరి కూడె ని న్నితఁడు తావుకొనఁ జేరె నిట్టే తగ మెచ్చవలదా English(||pallavi||) mā māḍa vinam̐gadave maṁku lem̐ṭige kāmunammulagu guṟigā niluva vasamā (||||) sĕkku nŏkki vem̐ḍugŏni seyi sedam̐baṭṭu kŏni makkuva sallim̐ badido māḍalāḍave lakkavaṁṭidi manasu lāliṁchī nādam̐ḍu ninnu gakkana niṁtaḍa nainā garam̐gam̐ga valadā (||||) vŏḍi vaṭṭi pĕnam̐gudā nŏḍam̐ barasugŏṁṭānu tŏḍareḍi nī magani toḍa nagave viḍuva rādu valabu vīḍĕ michchī nādam̐ḍu aḍiyālamai sevaṭṭi ādariṁchavaladā (||||) vāvulu nīgum̐ jĕppī vaḍi sarasamu lāḍī śhrī veṁkaḍeśhuni radim̐ jĕṁdam̐ gadave devi nalamelmaṁgavu teri kūḍĕ ni nnidam̐ḍu tāvugŏnam̐ jerĕ niṭṭe taga mĕchchavaladā