Title (Indic)మా మాట నమ్మదు నీ మతకానకు లోనంటా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మా మాట నమ్మదు నీ మతకానకు లోనంటా చే ముట్టి బుజ్జగించి చెక్కు నొక్కవయ్యా (॥॥) మంతనాన నీ వాపెతో మాటలాడిన మాటా యింతలో నెవ్వరు చెప్పి రీకెకు నేఁడు చింతించి యందుకుఁ గాను చెక్కు చేతితో నున్నది సంతోసపడ నాన లిచ్చటఁ బెట్టు కోవయ్యా (॥॥) కుప్పళించి నీ వాకెఁ గూడిన దంతపుటిల్లు యిప్పుడే యెవ్వరు చెప్పి రీపెకు నేఁడు చెప్పరాని కాంత తోడ సిబ్బితి పడినందుకు తప్పు దీర ముందరికేఁ దడవ ననవయ్యా (॥॥) ఆపె చేతి వుంగరము అట్టే నీ వేల నుండఁ గా యేపున నెవ్వ రిచ్చిరి యీపెకు నేఁ డు యీ పొద్దు నీవు గూడఁగ నిచ్చకముతో నున్నది చేపట్టి శ్రీ వేంకటేశ సేదలు దీర్చవయ్యా English(||pallavi||) mā māḍa nammadu nī madagānagu lonaṁṭā se muṭṭi bujjagiṁchi sĕkku nŏkkavayyā (||||) maṁtanāna nī vābĕdo māḍalāḍina māḍā yiṁtalo nĕvvaru sĕppi rīgĕgu nem̐ḍu siṁtiṁchi yaṁdugum̐ gānu sĕkku sedido nunnadi saṁtosabaḍa nāna lichchaḍam̐ bĕṭṭu kovayyā (||||) kuppaḽiṁchi nī vāgĕm̐ gūḍina daṁtabuḍillu yippuḍe yĕvvaru sĕppi rībĕgu nem̐ḍu sĕpparāni kāṁta toḍa sibbidi paḍinaṁdugu tappu dīra muṁdarigem̐ daḍava nanavayyā (||||) ābĕ sedi vuṁgaramu aṭṭe nī vela nuṁḍam̐ gā yebuna nĕvva richchiri yībĕgu nem̐ ḍu yī pŏddu nīvu gūḍam̐ga nichchagamudo nunnadi sebaṭṭi śhrī veṁkaḍeśha sedalu dīrsavayyā