Title (Indic)లేఁతచెమటలనె తెలిసె మాకు నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) లేఁతచెమటలనె తెలిసె మాకు నీకు నీఁతలు మోఁతలునైన యింటిలోని సాము (॥లేఁత॥) పొదలు నీ నిట్టూరుపులనె తెలిసె మాకు తుద మీరు వలరాచతొలిసాము చెదరు నీ నెరులు చూచిననె తెలిసె మాకు వెదచలు కాఁకల విరహపు సాము (॥లేఁత॥) పొలిఁతి నీ చూపువంపులనె తెలిసె మాకు తలపోఁతవగల బిత్తరిసాము పలుకకుండిన నీ కోపాననె తెలిసె మాకు అలవోక నగవు నీ అరవిరిసాము (॥లేఁత॥) వొద్దికఁ గస్తూరితావులనె తెలిసె మాకు గద్దరి నీ రతుల చీఁకటిసాము ముద్దుల నీ నగవుల మోమునఁ దెలిసె మాకు నిద్దపు వేంకటపతి నెరపిన సాము English(||pallavi||) lem̐tasĕmaḍalanĕ tĕlisĕ māgu nīgu nīm̐talu mom̐talunaina yiṁṭiloni sāmu (||lem̐ta||) pŏdalu nī niṭṭūrubulanĕ tĕlisĕ māgu tuda mīru valarāsadŏlisāmu sĕdaru nī nĕrulu sūsinanĕ tĕlisĕ māgu vĕdasalu kām̐kala virahabu sāmu (||lem̐ta||) pŏlim̐ti nī sūbuvaṁpulanĕ tĕlisĕ māgu talabom̐tavagala bittarisāmu palugaguṁḍina nī kobānanĕ tĕlisĕ māgu alavoga nagavu nī aravirisāmu (||lem̐ta||) vŏddigam̐ gastūridāvulanĕ tĕlisĕ māgu gaddari nī radula sīm̐kaḍisāmu muddula nī nagavula momunam̐ dĕlisĕ māgu niddabu veṁkaḍabadi nĕrabina sāmu