Title (Indic)లే దందువల్లఁ దెలివి యెన్నటికిని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) లే దందువల్లఁ దెలివి యెన్నటికిని నీ దయ నాపై నించినఁ గాని (॥లేదం॥) అరయఁగఁ బ్రపంచ మలవడినటువలె అరుదగు వై రాగ్య మలవడదు తరుణులరతి మతిఁ దలఁచినయటువలె ధర నీ సాకారము దలఁచదు మనసు (॥లేదం॥) గొనకొన్న యర్థము గోరినయటువలె కొనయగు మోక్షము గోరదు తనుభోగములకుఁ దగిలినయటువలె తనిసి నీకథలకుఁ దనియదు మనసు (॥లేదం॥) చలమును బాపము చవియైనటువలె సలలితపుణ్యము చవిగాదు సులభ శ్రీవేంకటేశుఁడ నీమహిమిది గలిగితివి నాకుఁ గలఁగదు మనసు English(||pallavi||) le daṁduvallam̐ dĕlivi yĕnnaḍigini nī daya nābai niṁchinam̐ gāni (||ledaṁ||) arayam̐gam̐ brabaṁcha malavaḍinaḍuvalĕ arudagu vai rāgya malavaḍadu taruṇularadi madim̐ dalam̐sinayaḍuvalĕ dhara nī sāgāramu dalam̐sadu manasu (||ledaṁ||) gŏnagŏnna yardhamu gorinayaḍuvalĕ kŏnayagu mokṣhamu goradu tanubhogamulagum̐ dagilinayaḍuvalĕ tanisi nīgathalagum̐ daniyadu manasu (||ledaṁ||) salamunu bābamu saviyainaḍuvalĕ salalidabuṇyamu savigādu sulabha śhrīveṁkaḍeśhum̐ḍa nīmahimidi galigidivi nāgum̐ galam̐gadu manasu