Title (Indic)లలితాంగి నింతటను లాలించవయ్యా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) లలితాంగి నింతటను లాలించవయ్యా నెలకొన్న నీ మోవి తేనెలకు నోరూరీని (॥లలి॥) తరుణి నీ మోము చూచి తలవంచి సిగ్గువడి మరిగి తలఁచీ నిన్ను మనసులోనె వరుస నీతో నవ్వి వలపుల సుడిగొని నిరతితోఁ దమకించి నివ్వెరగందీని (॥లలి॥) అట్టె నీతో మాఁటలాడి ఆసలాసలనుఁ జొక్కి గుట్టునఁ గోరికలతో గుబ్బతిలీని యెట్టనెదుటనే వుండి యేఁకటలకుఁ దగులె చుట్టి చుట్టి తనుఁదానె సోద్యమందీని (॥లలి॥) అలరి వద్దఁగూచుండి ఆయములెల్లాఁ గరఁగి చెలరేఁగి కాఁగిటికిఁ జేయి చాఁచీని యెలమి శ్రీవేంకటేశ యీరీతులు నీదేవులు వెలయ నిన్నుఁ బెండ్లాడి వేడుకతో మించీని English(||pallavi||) lalidāṁgi niṁtaḍanu lāliṁchavayyā nĕlagŏnna nī movi tenĕlagu norūrīni (||lali||) taruṇi nī momu sūsi talavaṁchi sigguvaḍi marigi talam̐sī ninnu manasulonĕ varusa nīdo navvi valabula suḍigŏni niradidom̐ damagiṁchi nivvĕragaṁdīni (||lali||) aṭṭĕ nīdo mām̐ṭalāḍi āsalāsalanum̐ jŏkki guṭṭunam̐ gorigalado gubbadilīni yĕṭṭanĕduḍane vuṁḍi yem̐kaḍalagum̐ dagulĕ suṭṭi suṭṭi tanum̐dānĕ sodyamaṁdīni (||lali||) alari vaddam̐gūsuṁḍi āyamulĕllām̐ garam̐gi sĕlarem̐gi kām̐giḍigim̐ jeyi sām̐sīni yĕlami śhrīveṁkaḍeśha yīrīdulu nīdevulu vĕlaya ninnum̐ bĕṁḍlāḍi veḍugado miṁchīni