Title (Indic)లలనల సఁ(సం?)తలోని లాబగాఁడవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) లలనల సఁ(సం?)తలోని లాబగాఁడవు తలఁచని తలఁపులు దైలువారె నిపుడు (॥॥) వేడుకతో నీవాపెపై వేసినపూవులచెండ్లు తోడువచ్చి నిలుచున్నతొయ్యలిఁ దాఁకె కూడాఁబట్టి యిద్దరిని గొబ్బునఁబెండ్లాడవయ్య యీడనే నీబేర మొకటినుమడి యాయను (॥॥) చెలరేఁగి యాపెమీఁదఁ జిమ్మినట్టి పన్నీరు మెలుపునఁ జెలికతైమీఁదఁ నిండెను కలసి నీవిద్దరినిఁ గాఁగిలించుకొనవయ్య వలపు లినుమడించి వడ్డి వచ్చె నీకును (॥॥) పిక్కటిల్ల నీవాపెపైఁ బెట్టినలువంటిసేస పక్కన నూడిగపుతిపైఁ జిందెను యిక్కువ శ్రీ వేంకటేశ యిట్టె నన్ను నేలితివి మొక్కలాన నీమేలు ముయ్యడ నాఁగాయను English(||pallavi||) lalanala sam̐(saṁ?)taloni lābagām̐ḍavu talam̐sani talam̐pulu dailuvārĕ nibuḍu (||||) veḍugado nīvābĕbai vesinabūvulasĕṁḍlu toḍuvachchi nilusunnadŏyyalim̐ dām̐kĕ kūḍām̐baṭṭi yiddarini gŏbbunam̐bĕṁḍlāḍavayya yīḍane nībera mŏgaḍinumaḍi yāyanu (||||) sĕlarem̐gi yābĕmīm̐dam̐ jimminaṭṭi pannīru mĕlubunam̐ jĕligadaimīm̐dam̐ niṁḍĕnu kalasi nīviddarinim̐ gām̐giliṁchugŏnavayya valabu linumaḍiṁchi vaḍḍi vachchĕ nīgunu (||||) pikkaḍilla nīvābĕbaim̐ bĕṭṭinaluvaṁṭisesa pakkana nūḍigabudibaim̐ jiṁdĕnu yikkuva śhrī veṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi mŏkkalāna nīmelu muyyaḍa nām̐gāyanu