Title (Indic)లలన నీకెంతైనా లాఁతిదా యేమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) లలన నీకెంతైనా లాఁతిదా యేమి తలఁపింత గలితే సంతసమాయ మాకును (॥లల॥) యెంత వేడుకొనుచు నీవేమి చెక్కులు నొక్కేవు కాంతఁ బొత్తుకు రమ్మంటాఁ గాతరానను చెంతనే బాలకిగాన సిగ్గుతో నుంటే నేమాయ ఇంత నీకు బతైయితే నియ్యరాదా మోవి (॥లల॥) ఆన లేలపెట్టివు ఆసలేల చూపేవు పూని పక్కఁ బండుమంటా పొంచి యాసతో మానవతిగన చెలిమాఁటున నుంటే నేమాయ కానీలే నీకు నిచ్చెతేఁ గాఁగిలియ్యరాదా (॥లల॥) కూడి యంత పెనఁగేవు గురుతులేల సే సేవు వీడె మందుకొమ్మంటా వెక్కసానను యాడనే శ్రీవేంకటేశ యేలితివి జవరాలి వేడుకైతే నాకుచుట్టి వెలఁది కియ్యరాదా English(||pallavi||) lalana nīgĕṁtainā lām̐tidā yemi talam̐piṁta galide saṁtasamāya māgunu (||lala||) yĕṁta veḍugŏnusu nīvemi sĕkkulu nŏkkevu kāṁtam̐ bŏttugu rammaṁṭām̐ gādarānanu sĕṁtane bālagigāna siggudo nuṁṭe nemāya iṁta nīgu badaiyide niyyarādā movi (||lala||) āna lelabĕṭṭivu āsalela sūbevu pūni pakkam̐ baṁḍumaṁṭā pŏṁchi yāsado mānavadigana sĕlimām̐ṭuna nuṁṭe nemāya kānīle nīgu nichchĕdem̐ gām̐giliyyarādā (||lala||) kūḍi yaṁta pĕnam̐gevu gurudulela se sevu vīḍĕ maṁdugŏmmaṁṭā vĕkkasānanu yāḍane śhrīveṁkaḍeśha yelidivi javarāli veḍugaide nāgusuṭṭi vĕlam̐di kiyyarādā