Title (Indic)లకిమమ్మ కాఁగిలిచ్చి లావుల మెచ్చీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) లకిమమ్మ కాఁగిలిచ్చి లావుల మెచ్చీ సకలము మేలు సరసము లాడరయ్యా (॥లకి॥) కొండలపడవనీడ(?) కోరిన చెంచులవాడ వుండి నవ్వే వౌనయ్య వువిదతోడ నిండెను వలపు లాడ నీమో మాకె చూడ పెండిలి మీకిద్దరికిఁ బెనగోనీనయ్యా (॥లకి॥) గొప్పమాఁకులకోన కురిసేటి నిచ్చవాన వుప్పతిల్లి చేయివేసే వువిదమేన చిప్పిలీఁ జెనుటసోనసిగ్గులు లోలో నాన కప్పెను మీ కిద్దరికిఁ గడుమోహాలయ్యా (॥లకి॥) భవనాళియేటిదండపడఁతికోర్కులునిండ జవళి నీవద్ద నండు సంగడిఁ బండ తివిరి శ్రీ వేంకటాద్రి సుగ్రీవ నారసింహా వివరించ నిద్దరికి వేడుకాయ నయ్యా English(||pallavi||) lagimamma kām̐gilichchi lāvula mĕchchī sagalamu melu sarasamu lāḍarayyā (||lagi||) kŏṁḍalabaḍavanīḍa(?) korina sĕṁchulavāḍa vuṁḍi navve vaunayya vuvidadoḍa niṁḍĕnu valabu lāḍa nīmo māgĕ sūḍa pĕṁḍili mīgiddarigim̐ bĕnagonīnayyā (||lagi||) gŏppamām̐kulagona kuriseḍi nichchavāna vuppadilli seyivese vuvidamena sippilīm̐ jĕnuḍasonasiggulu lolo nāna kappĕnu mī kiddarigim̐ gaḍumohālayyā (||lagi||) bhavanāḽiyeḍidaṁḍabaḍam̐tigorguluniṁḍa javaḽi nīvadda naṁḍu saṁgaḍim̐ baṁḍa tiviri śhrī veṁkaḍādri sugrīva nārasiṁhā vivariṁcha niddarigi veḍugāya nayyā