Title (Indic)లావణ్యశృంగారరాయ లక్ష్మీనాథ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) లావణ్యశృంగారరాయ లక్ష్మీనాథ యేవేళ నీవినోదాన కేదాయ నేమి (॥లావ॥) పాలజలధివంటిది పవ్వళించు నామనసు గాలివూర్పులే కడళ్లు కలదు లోఁతు చాలఁగ దొల్లి నీవు సముద్రశాయివట యీలీల నీవినోదాన కేదాయ నేమి (॥లావ॥) నిక్కపుభూమివంటిది నెలవుకో నామనసు పెక్కులిన్నియుఁ గలవు పెరుగుచుండు పుక్కటఁ దొల్లియు నీవు భూసతిమగఁడవట యెక్కువ నీవినోదాన కేదాయ నేమి (॥లావ॥) నిండుఁగొండవంటి దిదె నిలుచుండు నాభక్తి వుండుచోటనేవుండు నొక్కచోటను కొండలరాయఁడవట కోరికె శ్రీవేంకటేశ అండ నీవినోదాన కేదియాయ నేమి English(||pallavi||) lāvaṇyaśhṛṁgārarāya lakṣhmīnātha yeveḽa nīvinodāna kedāya nemi (||lāva||) pālajaladhivaṁṭidi pavvaḽiṁchu nāmanasu gālivūrbule kaḍaḽlu kaladu lom̐tu sālam̐ga dŏlli nīvu samudraśhāyivaḍa yīlīla nīvinodāna kedāya nemi (||lāva||) nikkabubhūmivaṁṭidi nĕlavugo nāmanasu pĕkkulinniyum̐ galavu pĕrugusuṁḍu pukkaḍam̐ dŏlliyu nīvu bhūsadimagam̐ḍavaḍa yĕkkuva nīvinodāna kedāya nemi (||lāva||) niṁḍum̐gŏṁḍavaṁṭi didĕ nilusuṁḍu nābhakti vuṁḍusoḍanevuṁḍu nŏkkasoḍanu kŏṁḍalarāyam̐ḍavaḍa korigĕ śhrīveṁkaḍeśha aṁḍa nīvinodāna kediyāya nemi