Title (Indic)లాలించి కూడఁగరాదా లలన కడుఁ గోమలి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) లాలించి కూడఁగరాదా లలన కడుఁ గోమలి పాలించితి విఁక నేల పచ్చిసేసేవు (॥లాలిం॥) వెన్నెలబాయట నాపె విన్నపాలు సేయఁగానే చన్నులేట టిసికేవు సారె సారెకు కన్నుల జంకించి యట్టె కాళ్లకు మొక్కరాఁగానే నున్నఁగా మాఁటిడి మొలనూ లేల పట్టేవు (॥లాలిం॥) చేవల్లకు వచ్చి యాపె చేరి విడె మియ్యఁగానే మోవి యేల యానేవు ముందుగా నీవు పూవులను వేసి నిన్ను పూఁచి చెక్కు నొక్కఁగానే కావరించుకొంటా నేల కాఁగినించేవు (॥లాలిం॥) జమళిఁ గూడి నీ కాపె సరిఁ గత చెప్పఁగానే తమలము వెట్టి యంత తమి రేఁచేవు ఆమర శ్రీవేంకటేశ యలమేల్మంగ ననఁగా సమరతి నింతయేల సాము సేసేవు English(||pallavi||) lāliṁchi kūḍam̐garādā lalana kaḍum̐ gomali pāliṁchidi vim̐ka nela pachchisesevu (||lāliṁ||) vĕnnĕlabāyaḍa nābĕ vinnabālu seyam̐gāne sannuleḍa ṭisigevu sārĕ sārĕgu kannula jaṁkiṁchi yaṭṭĕ kāḽlagu mŏkkarām̐gāne nunnam̐gā mām̐ṭiḍi mŏlanū lela paṭṭevu (||lāliṁ||) sevallagu vachchi yābĕ seri viḍĕ miyyam̐gāne movi yela yānevu muṁdugā nīvu pūvulanu vesi ninnu pūm̐si sĕkku nŏkkam̐gāne kāvariṁchugŏṁṭā nela kām̐giniṁchevu (||lāliṁ||) jamaḽim̐ gūḍi nī kābĕ sarim̐ gada sĕppam̐gāne tamalamu vĕṭṭi yaṁta tami rem̐sevu āmara śhrīveṁkaḍeśha yalamelmaṁga nanam̐gā samaradi niṁtayela sāmu sesevu