Title (Indic)కుందనపుఁ బిల్లఁగోవి గోపీనాథా । మాపైఁ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కుందనపుఁ బిల్లఁగోవి గోపీనాథా । మాపైఁ జిందేవు మోహరసాలు చిన్నిగోపీనాథ (॥కుంద॥) కొలనిలోపలిమాతో గోపీనాథా । యేల కులికి నవ్వు నవ్వేవు గొపీనాథా కొలువు మొక్కు మొక్కేము గోపీనాథా నీ చలము చెల్లితేఁ జాలు జాణ గోపీనాథా (॥కుంద॥) గొబ్బన మాచీరలిమ్ము గోపీనాథా । మా గుబ్బలపైఁ గాఁక రేఁగె గోపీనాధా గుబ్బతిల్లీఁ దయకమే గోపీనాథా। నీ - కబ్బితి మేమైన జేయవయ్య గోపీనాథా (॥కుంద॥) కుప్పవడె మాసిగ్గు గోపీనాథా। మా - కొప్పు జారె ముడువుమా గోపీనాథా వొప్పుగ శ్రీవేంకటాద్రినుండి వచ్చి కూడితివి అప్ప తొండామారేగుళ్ల ఆదిగోపీనాథా English(||pallavi||) kuṁdanabum̐ billam̐govi gobīnāthā | mābaim̐ jiṁdevu moharasālu sinnigobīnātha (||kuṁda||) kŏlanilobalimādo gobīnāthā | yela kuligi navvu navvevu gŏbīnāthā kŏluvu mŏkku mŏkkemu gobīnāthā nī salamu sĕllidem̐ jālu jāṇa gobīnāthā (||kuṁda||) gŏbbana māsīralimmu gobīnāthā | mā gubbalabaim̐ gām̐ka rem̐gĕ gobīnādhā gubbadillīm̐ dayagame gobīnāthā| nī - kabbidi memaina jeyavayya gobīnāthā (||kuṁda||) kuppavaḍĕ māsiggu gobīnāthā| mā - kŏppu jārĕ muḍuvumā gobīnāthā vŏppuga śhrīveṁkaḍādrinuṁḍi vachchi kūḍidivi appa tŏṁḍāmāreguḽla ādigobīnāthā