Title (Indic)కూడిన సంతోసమే కొండసేసుకుందానవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కూడిన సంతోసమే కొండసేసుకుందానవు వోడక నిండురతుల నోలలాడవలదా (॥కూడి॥) సరసమాడనే పట్టె చవులు చూడనే పట్టె ఇరవై పతితో పొందు లెప్పుడే నీకు తెరదియ్యనే పట్టె దిష్టించి చూడనే పట్టె గరిమ నితనితోడి కాఁపురము లెన్నఁడే (॥కూడి॥) చిఱునవ్వు నవ్వవట్టె సిగ్గులు వడనే పట్టె యెఱుకతో మోవిగువ్వా లిఁక నెప్పుడే గుఱుతులు సేయఁబట్టె గుబ్బలనొత్తనే పట్టె మఱియు నితనిఁగూడే మంతనము లెన్నఁడే (॥కూడి॥) సేవలు సేయనే పట్టె చెమరించనే పట్టె యావల గాఁగిటీ చొక్కు లిఁక నెప్పుడే నీ వలమేలుమంగవు నిన్నేలె శ్రీవేంకటేశుఁ డావటించి పొగడేనీ యలమెచ్చు లెన్నఁడే English(||pallavi||) kūḍina saṁtosame kŏṁḍasesuguṁdānavu voḍaga niṁḍuradula nolalāḍavaladā (||kūḍi||) sarasamāḍane paṭṭĕ savulu sūḍane paṭṭĕ iravai padido pŏṁdu lĕppuḍe nīgu tĕradiyyane paṭṭĕ diṣhṭiṁchi sūḍane paṭṭĕ garima nidanidoḍi kām̐puramu lĕnnam̐ḍe (||kūḍi||) siṟunavvu navvavaṭṭĕ siggulu vaḍane paṭṭĕ yĕṟugado moviguvvā lim̐ka nĕppuḍe guṟudulu seyam̐baṭṭĕ gubbalanŏttane paṭṭĕ maṟiyu nidanim̐gūḍe maṁtanamu lĕnnam̐ḍe (||kūḍi||) sevalu seyane paṭṭĕ sĕmariṁchane paṭṭĕ yāvala gām̐giḍī sŏkku lim̐ka nĕppuḍe nī valamelumaṁgavu ninnelĕ śhrīveṁkaḍeśhum̐ ḍāvaḍiṁchi pŏgaḍenī yalamĕchchu lĕnnam̐ḍe