Title (Indic)కొన మొద లేదో గుఱిగాన రొరులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కొన మొద లేదో గుఱిగాన రొరులు మునుకొను సంసారమోహాంధమందు (॥కొన॥) తలఁచును బ్రహ్మాండతతులకు నవ్వల తలఁచేటి జీవుఁడు తా నణువు అలరిన యాసల ననలునుఁ గొనలును వెలసీ సంసారవృక్షములోన (॥కొన॥) పుట్టునుఁ బొదలును భువి బహురూపుల పుట్టేటి యాతఁడు పొరి నొకఁడే వొట్టుక యీఁదును వుభయకర్మముల చట్టెడు సంసారసాగరములను (॥కొన॥) తగులు నన్నిటా తనుభోగంబుల తగిలేటి పురుషుఁడు తా ఘనుఁడు నిగిడి శ్రీవేంకటనిలయుఁడు గతైతే అగపడ సంసారానందమందు English(||pallavi||) kŏna mŏda ledo guṟigāna rŏrulu munugŏnu saṁsāramohāṁdhamaṁdu (||kŏna||) talam̐sunu brahmāṁḍadadulagu navvala talam̐seḍi jīvum̐ḍu tā naṇuvu alarina yāsala nanalunum̐ gŏnalunu vĕlasī saṁsāravṛkṣhamulona (||kŏna||) puṭṭunum̐ bŏdalunu bhuvi bahurūbula puṭṭeḍi yādam̐ḍu pŏri nŏgam̐ḍe vŏṭṭuga yīm̐dunu vubhayagarmamula saṭṭĕḍu saṁsārasāgaramulanu (||kŏna||) tagulu nanniḍā tanubhogaṁbula tagileḍi puruṣhum̐ḍu tā ghanum̐ḍu nigiḍi śhrīveṁkaḍanilayum̐ḍu gadaide agabaḍa saṁsārānaṁdamaṁdu