Title (Indic)కొంక నీకేఁటికి లోనఁ గూచున్నదదె చెలి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కొంక నీకేఁటికి లోనఁ గూచున్నదదె చెలి అంకెకు నీవు రాఁగాను అలుగునా యీకె (॥కొంక॥) ఎక్కడ నీవుండినాను యింతొపొందు నీకు గురి చిక్కించి యింతికిని నీ చిత్తమే గురి పుక్కిట చెలులెందరు పోరాటాలు వెట్టినాను అక్కరగలదు నీతో అలుగునా యీకె (॥కొంక॥) యేమేమి సేసివచ్చినా యింటికి విచ్చేసితివి కామించి కన్నులఁ జూచె కాంత నీమోము గామిడి చెలులెంతేసి గడియించి చెప్పినాను ఆముకొన వలచి నీకలుగునా యీకె (॥కొంక॥) సతులెందరు గల్లా చనవు లీసతివే దృతినీకుఁ బట్టానకు దేవులాయెను యితవై శ్రీవేంకటేశ యేకమైరి చెలులెల్ల అతిరతిఁ గూడె నీతో నలుగునా యీకె English(||pallavi||) kŏṁka nīgem̐ṭigi lonam̐ gūsunnadadĕ sĕli aṁkĕgu nīvu rām̐gānu alugunā yīgĕ (||kŏṁka||) ĕkkaḍa nīvuṁḍinānu yiṁtŏbŏṁdu nīgu guri sikkiṁchi yiṁtigini nī sittame guri pukkiḍa sĕlulĕṁdaru porāḍālu vĕṭṭinānu akkaragaladu nīdo alugunā yīgĕ (||kŏṁka||) yememi sesivachchinā yiṁṭigi vichchesidivi kāmiṁchi kannulam̐ jūsĕ kāṁta nīmomu gāmiḍi sĕlulĕṁtesi gaḍiyiṁchi sĕppinānu āmugŏna valasi nīgalugunā yīgĕ (||kŏṁka||) sadulĕṁdaru gallā sanavu līsadive dṛtinīgum̐ baṭṭānagu devulāyĕnu yidavai śhrīveṁkaḍeśha yegamairi sĕlulĕlla adiradim̐ gūḍĕ nīdo nalugunā yīgĕ