Title (Indic)కోమలపువాఁడంటాఁ గొంకి యున్నదానఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కోమలపువాఁడంటాఁ గొంకి యున్నదానఁ గాక నేమానమేమి సేసినా నెంజెరివి దీరునా (॥కోమ॥) పలుమారు మాటలాడి పడఁతుల వలపించి యెలయించే రమణుని నేమి సేసేది పిలిచి పానుపుమీఁదఁ బెనఁగఁగానే చన్నుల నెలకొనఁ గుమ్మినాను నెంజెరివి దీరునా (॥కోమ॥) నగుతా దగ్గరఁ దీసి నాలిసేసి యేఁచెటి యెగసక్కెపు విభుని నేమి సేసేదే మొగము చూడఁగానే ముంగురులు చుట్టి పట్టి నిగిడి గోర గీరినా నెంజరివి దీరునా (॥కోమ॥) మట్టు మీరి నన్నుఁ గూడి మరులుగొలిపినట్టి యిట్టి శ్రీవేంకటేశ్వరు నేమి సేసేదే గట్టిగా మోవియాని గంటిసేసి పలుమారు నెట్టుకొని కొసరక నెంజెరివి దీరునా English(||pallavi||) komalabuvām̐ḍaṁṭām̐ gŏṁki yunnadānam̐ gāga nemānamemi sesinā nĕṁjĕrivi dīrunā (||koma||) palumāru māḍalāḍi paḍam̐tula valabiṁchi yĕlayiṁche ramaṇuni nemi sesedi pilisi pānubumīm̐dam̐ bĕnam̐gam̐gāne sannula nĕlagŏnam̐ gumminānu nĕṁjĕrivi dīrunā (||koma||) nagudā daggaram̐ dīsi nālisesi yem̐sĕḍi yĕgasakkĕbu vibhuni nemi sesede mŏgamu sūḍam̐gāne muṁgurulu suṭṭi paṭṭi nigiḍi gora gīrinā nĕṁjarivi dīrunā (||koma||) maṭṭu mīri nannum̐ gūḍi marulugŏlibinaṭṭi yiṭṭi śhrīveṁkaḍeśhvaru nemi sesede gaṭṭigā moviyāni gaṁṭisesi palumāru nĕṭṭugŏni kŏsaraga nĕṁjĕrivi dīrunā