Title (Indic)కోమలపుమేని సతిఁ గోరకు మంతేసి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కోమలపుమేని సతిఁ గోరకు మంతేసి మోముచూచి కూరిమితో మొక్కీ నీకును (॥॥) వుప్పతిల్ల మాటలాడి వూరడించి బాసలిచ్చి అప్పుడు పెండ్డాడితి వందరిలోన కొప్పువట్టి తీసి యట్టే కొంగుచుట్టి పట్టుకొని పిప్పి సేసితివి యింత పిసుకకు మీపెను (॥॥) ఆసలెల్లాఁ బుట్టించి ఆయములు చేతనంటి సేస వెట్టితి వప్పుడు చేచేతను గాసిగాఁ జన్నులు వట్టి కడుఁజెమటలు రేఁచి వేసారఁ బెనఁగితివి మోసపుచ్చకిఁకను (॥॥) వావులెల్లాఁ జెప్పిచెప్పి వాఁటముగాఁ గాఁగిలించి చేవదీరఁ గూడితివి శ్రీవేంకటేశ వేవేలు మన్ననలిచ్చి వింతలెల్లా నేరిపి కైవసమైతివి యిట్టే కరుణించుమిఁకను English(||pallavi||) komalabumeni sadim̐ goragu maṁtesi momusūsi kūrimido mŏkkī nīgunu (||||) vuppadilla māḍalāḍi vūraḍiṁchi bāsalichchi appuḍu pĕṁḍḍāḍidi vaṁdarilona kŏppuvaṭṭi tīsi yaṭṭe kŏṁgusuṭṭi paṭṭugŏni pippi sesidivi yiṁta pisugagu mībĕnu (||||) āsalĕllām̐ buṭṭiṁchi āyamulu sedanaṁṭi sesa vĕṭṭidi vappuḍu sesedanu gāsigām̐ jannulu vaṭṭi kaḍum̐jĕmaḍalu rem̐si vesāram̐ bĕnam̐gidivi mosabuchchagim̐kanu (||||) vāvulĕllām̐ jĕppisĕppi vām̐ṭamugām̐ gām̐giliṁchi sevadīram̐ gūḍidivi śhrīveṁkaḍeśha vevelu mannanalichchi viṁtalĕllā neribi kaivasamaidivi yiṭṭe karuṇiṁchumim̐kanu