Title (Indic)కోపగించి పతినేల కొసరేరే చెలులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కోపగించి పతినేల కొసరేరే చెలులాల మాపు దాఁకా సొలసినా మతి గరఁగీనా (॥కోప॥) నగుతా నేమాడినాను నమ్మికయై తోఁచుఁగాక యొగసక్కేలాడితేను ఇయ్యకోలౌనా తగులమి గలిగితే తలఁపు గలుగుఁగాక మొగము చూడకుండితే మోహ మేడుండునే (॥కోప॥) సరవితోఁ బిలిచితే సమ్మతించవచ్చుఁగాక బిరుదున గద్దించితే ప్రియమయ్యీనా సరిమేను సోఁకితేను చవులెల్లాఁ బుట్టుఁగాక విరసాన వీఁగితేను వేడు కేడ నుండునే (॥కోప॥) ననుపై నడచితేను నాఁటుగాక మోహము కొనగొన నుండితేను కూటమబ్బునా యెనసె శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను ననుఁ గూడె నలుక మానక యేల వుండు నే English(||pallavi||) kobagiṁchi padinela kŏsarere sĕlulāla mābu dām̐kā sŏlasinā madi garam̐gīnā (||koba||) nagudā nemāḍinānu nammigayai tom̐sum̐gāga yŏgasakkelāḍidenu iyyagolaunā tagulami galigide talam̐pu galugum̐gāga mŏgamu sūḍaguṁḍide moha meḍuṁḍune (||koba||) saravidom̐ biliside sammadiṁchavachchum̐gāga biruduna gaddiṁchide priyamayyīnā sarimenu som̐kidenu savulĕllām̐ buṭṭum̐gāga virasāna vīm̐gidenu veḍu keḍa nuṁḍune (||koba||) nanubai naḍasidenu nām̐ṭugāga mohamu kŏnagŏna nuṁḍidenu kūḍamabbunā yĕnasĕ śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu nanum̐ gūḍĕ naluga mānaga yela vuṁḍu ne