Title (Indic)కస్తూరి వాట్లఁ గరఁగేవు మైఁ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కస్తూరి వాట్లఁ గరఁగేవు మైఁ గస్తూరి నాతనిఁ గమ్మఁగ రాదా (॥కరి॥) నీరు వసంతం నీపైఁజల్లిన మారు కుమారు రమణి నీవు సారపు నీరతి జవ్వాది చెమటల నీరాతనిపై నించంగరాదా (॥కరి॥) పువ్వులు నీపై బొలుపుగఁ బోసిన నెవ్వ దీఱఁగ నీవతని రవ్వగు నీ వుపరతులఁ గూడి తల పువ్వులతని దిగఁ బోయఁగ రాదా (॥కరి॥) పంకజమునఁ దాఁ బైకొని చేరి వెంకటపతి నిను వేయఁగను కొంకక నిరతింగూడి నీవు ముఖ పంకజ మాతనిఁ బైకొనరాదా English(||pallavi||) kastūri vāṭlam̐ garam̐gevu maim̐ gastūri nādanim̐ gammam̐ga rādā (||kari||) nīru vasaṁtaṁ nībaim̐jallina māru kumāru ramaṇi nīvu sārabu nīradi javvādi sĕmaḍala nīrādanibai niṁchaṁgarādā (||kari||) puvvulu nībai bŏlubugam̐ bosina nĕvva dīṟam̐ga nīvadani ravvagu nī vubaradulam̐ gūḍi tala puvvuladani digam̐ boyam̐ga rādā (||kari||) paṁkajamunam̐ dām̐ baigŏni seri vĕṁkaḍabadi ninu veyam̐ganu kŏṁkaga niradiṁgūḍi nīvu mukha paṁkaja mādanim̐ baigŏnarādā