Title (Indic)కంటిఁ గంటి నీ గుట్టు కానీలేరా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కంటిఁ గంటి నీ గుట్టు కానీలేరా కంటగించీ నీ గుణాలు కానీలేరా (॥॥) అడరి నావద్ద నుండి యట్టె వుస్సురనేవు కడ నేమిదలఁచితో కానీలేరా అడియాలపుమచ్చము లంగమునఁ జూచితేను కడుఁదేలించి చూచేవు కానీలేరా (॥॥) నెమ్మి నిన్ను వలపించేనెలఁతపే రడిగితే కమ్మర నాతో నవ్వేవు కానీలేరా రమ్మని యాకెయింటికి రతి నానవెట్టితేను కమ్మి నానోరు మూసేవు కానీలేరా (॥॥) వక్కణించి నీమోవి వాడుదేరీ నేలంటే గక్కనఁగాఁగిలించేవు కానీలేరా యెక్కువ శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి కక్కసించనోప నిఁక గానీలేరా English(||pallavi||) kaṁṭim̐ gaṁṭi nī guṭṭu kānīlerā kaṁṭagiṁchī nī guṇālu kānīlerā (||||) aḍari nāvadda nuṁḍi yaṭṭĕ vussuranevu kaḍa nemidalam̐sido kānīlerā aḍiyālabumachchamu laṁgamunam̐ jūsidenu kaḍum̐deliṁchi sūsevu kānīlerā (||||) nĕmmi ninnu valabiṁchenĕlam̐tabe raḍigide kammara nādo navvevu kānīlerā rammani yāgĕyiṁṭigi radi nānavĕṭṭidenu kammi nānoru mūsevu kānīlerā (||||) vakkaṇiṁchi nīmovi vāḍuderī nelaṁṭe gakkanam̐gām̐giliṁchevu kānīlerā yĕkkuva śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi kakkasiṁchanoba nim̐ka gānīlerā