Title (Indic)కంటకములాడనేల కాఁతాళమేఁటికి నీతో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కంటకములాడనేల కాఁతాళమేఁటికి నీతో మంటదీర నా పనులు మానివుండేఁ గాక (॥కంట॥) కోపగించేనా నీతో కొప్పువట్టి తీసితేను యేపున ముడుచుకొనేనేమాయను పైపై దొరలతోడి పంతాలకు నేమిపని ఆపరాకై వానగుంటలాడుకొనేఁ గాక (॥కంట॥) కమ్మటిఁ దిట్టేనా నిన్ను కాలు నీవు దొక్కితేను యెమ్మెలేక తీసికొనేనేమాయను దిమ్మరి విభునితోడ దీకొనేవాదులేల యిమ్ములఁ జుక్కలై నానెంచుకొనేఁ గాక (॥కంట॥) పక్కన నొట్టువెట్టేనా పచ్చడము గప్పితేను యిక్కువలు గరఁగేను యేమాయను నిక్కి శ్రీవేంకటేశుఁడ నిన్నుఁగూడి కొంకువద్దా చక్కనైతి నీమోవి చవిచూచేఁగాక English(||pallavi||) kaṁṭagamulāḍanela kām̐tāḽamem̐ṭigi nīdo maṁṭadīra nā panulu mānivuṁḍem̐ gāga (||kaṁṭa||) kobagiṁchenā nīdo kŏppuvaṭṭi tīsidenu yebuna muḍusugŏnenemāyanu paibai dŏraladoḍi paṁtālagu nemibani ābarāgai vānaguṁṭalāḍugŏnem̐ gāga (||kaṁṭa||) kammaḍim̐ diṭṭenā ninnu kālu nīvu dŏkkidenu yĕmmĕlega tīsigŏnenemāyanu dimmari vibhunidoḍa dīgŏnevādulela yimmulam̐ jukkalai nānĕṁchugŏnem̐ gāga (||kaṁṭa||) pakkana nŏṭṭuvĕṭṭenā pachchaḍamu gappidenu yikkuvalu garam̐genu yemāyanu nikki śhrīveṁkaḍeśhum̐ḍa ninnum̐gūḍi kŏṁkuvaddā sakkanaidi nīmovi savisūsem̐gāga