Title (Indic)కలుగుట గలిగిననాఁడే నే ఘనపాపములకు దొలంగీనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కలుగుట గలిగిననాఁడే నే ఘనపాపములకు దొలంగీనా యెలమి నే నిపుడే యెరిఁగితిని యిన్నాళ్లీమతి లేదు (॥కలు॥) జనియించిన నే నిటకమునుపు సకలయోనిగతజన్మములు కనుఁగొని యవె నే సారెకుఁ బలుమారు ఘనవర్ణాశ్రమధర్మములు అనుభవించినవే సకలార్థంబులు అయిహికవిషయము లన్నియును మనసున వాకున శ్రీహరి నొకని నే మఱచియుఁ దలఁచుట లేదు (॥కలు॥) తిరిగినవే నే నాసలకొరకును దిక్కు లన్నియును నేను యిరవుగ తొల్లియు నెఱిఁగినవే యీసంసారపుసుఖము లివి పొరలినవే నేఁ గామినీజనుల పొందుల సుఖముల భోగములు యెరవులదొకటే శ్రీహరిదాస్యం బిది గతియని యెరుఁగుటలేదు (॥కలు॥) గడియించినవే నేఁ బూర్వకాలమున ఘనమగు సంపద లిన్నియును నొడిగినవే నే శబ్దజాలములు నోరఁ గొలఁదు లివి యిన్నియును తలఁబడి నే నిటు సకలోపాయపు ధర్మము లిన్నియుఁ జూచితివి యెడపక శ్రీవేంకటేశ్వరు శరణం బిటువలెఁ జేరుటలేదు English(||pallavi||) kaluguḍa galiginanām̐ḍe ne ghanabābamulagu dŏlaṁgīnā yĕlami ne nibuḍe yĕrim̐gidini yinnāḽlīmadi ledu (||kalu||) janiyiṁchina ne niḍagamunubu sagalayonigadajanmamulu kanum̐gŏni yavĕ ne sārĕgum̐ balumāru ghanavarṇāśhramadharmamulu anubhaviṁchinave sagalārdhaṁbulu ayihigaviṣhayamu lanniyunu manasuna vāguna śhrīhari nŏgani ne maṟasiyum̐ dalam̐suḍa ledu (||kalu||) tiriginave ne nāsalagŏragunu dikku lanniyunu nenu yiravuga tŏlliyu nĕṟim̐ginave yīsaṁsārabusukhamu livi pŏralinave nem̐ gāminījanula pŏṁdula sukhamula bhogamulu yĕravuladŏgaḍe śhrīharidāsyaṁ bidi gadiyani yĕrum̐guḍaledu (||kalu||) gaḍiyiṁchinave nem̐ būrvagālamuna ghanamagu saṁpada linniyunu nŏḍiginave ne śhabdajālamulu noram̐ gŏlam̐du livi yinniyunu talam̐baḍi ne niḍu sagalobāyabu dharmamu linniyum̐ jūsidivi yĕḍabaga śhrīveṁkaḍeśhvaru śharaṇaṁ biḍuvalĕm̐ jeruḍaledu