Title (Indic)కల్ల గాదు నామాట కదిసి చూడఁగదయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కల్ల గాదు నామాట కదిసి చూడఁగదయ్య చల్లువెద లిద్దరికి సగఁబాలు సుమ్మీ (॥॥) దప్పిగొని వచ్చేవంటా తరుణి వాకిటనుండి కప్పుర మిచ్చేనంటాఁ గాచుకున్నది కప్పి నీయాదాయములో కడ నున్న నీసతికి చప్పుడుగా కందులోన సగఁబాలు సుమ్మీ (॥॥) బడలి వచ్చేవంటా పడఁతి మంచేనవాలు బెడిదానఁ జల్లారఁ బెట్టుకున్నది తడవి నీకుఁ గలితే తగ నిన్నిందాఁకఁ గూడి జడియని యాకెకును సగఁబాలు సుమ్మీ (॥॥) పొంతఁ గాగి వచ్చేవంటా పూజించఁగోరి నీకు యింతేసి తామెరలు మీఁదెత్తుకున్నది ఇంతలో శ్రీవేంకటేశ యెనసె నిన్నాకె రతి సంతోషములాకెకును సగఁబాలు సుమ్మీ English(||pallavi||) kalla gādu nāmāḍa kadisi sūḍam̐gadayya salluvĕda liddarigi sagam̐bālu summī (||||) dappigŏni vachchevaṁṭā taruṇi vāgiḍanuṁḍi kappura michchenaṁṭām̐ gāsugunnadi kappi nīyādāyamulo kaḍa nunna nīsadigi sappuḍugā kaṁdulona sagam̐bālu summī (||||) baḍali vachchevaṁṭā paḍam̐ti maṁchenavālu bĕḍidānam̐ jallāram̐ bĕṭṭugunnadi taḍavi nīgum̐ galide taga ninniṁdām̐kam̐ gūḍi jaḍiyani yāgĕgunu sagam̐bālu summī (||||) pŏṁtam̐ gāgi vachchevaṁṭā pūjiṁcham̐gori nīgu yiṁtesi tāmĕralu mīm̐dĕttugunnadi iṁtalo śhrīveṁkaḍeśha yĕnasĕ ninnāgĕ radi saṁtoṣhamulāgĕgunu sagam̐bālu summī