Title (Indic)కలికివి నీవెరఁగని తగవు లున్నవా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కలికివి నీవెరఁగని తగవు లున్నవా చెలులము నే మింత చెప్పిచూపవలెనా (॥కలి ॥) వాడికగా రమణుఁడు వలపులు చల్లితేను యీడనే సిగ్గున శిరసేల వంచేవే వేడుకతో చందురుఁడు వెన్నెలలు గాసితేను జోడుగాఁ గలువలు మెచ్చుగ వికసించవా (॥కలి॥) మంతనాన నాతఁడు మాటలు నిన్నాడించితే పంతముతో మోనములు పచరింతురా వంతలేక వనముల వసంతుఁడు పైకొంటే బంతినే కోవిలలునుఁ బలుకఁగవలదా (॥చెలి॥) సారె శ్రీవేంకటేశుఁ డిచ్చటఁ గాఁగిలించితేను కూరిమి నలమేల్ మంగ కూడితి వౌనే మేరతోడఁ గొండమీఁద మేఘము వాలితేను చేరిచేరి మయూరాలు చెంగలించి ఆడుఁగా English(||pallavi||) kaligivi nīvĕram̐gani tagavu lunnavā sĕlulamu ne miṁta sĕppisūbavalĕnā (||kali ||) vāḍigagā ramaṇum̐ḍu valabulu sallidenu yīḍane sigguna śhirasela vaṁcheve veḍugado saṁdurum̐ḍu vĕnnĕlalu gāsidenu joḍugām̐ galuvalu mĕchchuga vigasiṁchavā (||kali||) maṁtanāna nādam̐ḍu māḍalu ninnāḍiṁchide paṁtamudo monamulu pasariṁturā vaṁtalega vanamula vasaṁtum̐ḍu paigŏṁṭe baṁtine kovilalunum̐ balugam̐gavaladā (||sĕli||) sārĕ śhrīveṁkaḍeśhum̐ ḍichchaḍam̐ gām̐giliṁchidenu kūrimi nalamel maṁga kūḍidi vaune meradoḍam̐ gŏṁḍamīm̐da meghamu vālidenu seriseri mayūrālu sĕṁgaliṁchi āḍum̐gā