Title (Indic)కలఁడుగా యిటువంటి గడుసరి భూమిమీఁద WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కలఁడుగా యిటువంటి గడుసరి భూమిమీఁద తెలిసితి మిన్నాళ్లకు దిష్టముగ వీనిని (॥కలడుగా॥) తగని వెల్లాఁ జేసీ తనమాఁటె ఘనము జిగి నా మొగము చూచీ సిగ్గు వడఁడు నగువారి నెరఁగఁడు నాపై నానలు వెట్టీ యెగసక్కీఁడు వీని దెంత నేరుపే (॥కలడుగా॥) తప్పుజగడాలు రేఁచీ తానె మంచివాఁడు యిప్పుడె వావులు చెప్పీ యెవగించఁడు ముప్పిరిఁ దల వంచిన మోవితేనె లియ్య వచ్చీ చప్పుడు గాకుండాఁ జేరీ జాణ గదే వీఁడు (॥కలడుగా॥) తమకించు నిన్నటాను తగవరీఁ దానె అమరఁ గతలు చెప్పీ నందు కాతఁడు తిమిరి శ్రీవెంకటాద్రి దేవుఁ డిట్టె నన్నుఁ గూడె సమరతి నిన్నిటాను సరుసుఁడు గదవే English(||pallavi||) kalam̐ḍugā yiḍuvaṁṭi gaḍusari bhūmimīm̐da tĕlisidi minnāḽlagu diṣhṭamuga vīnini (||kalaḍugā||) tagani vĕllām̐ jesī tanamām̐ṭĕ ghanamu jigi nā mŏgamu sūsī siggu vaḍam̐ḍu naguvāri nĕram̐gam̐ḍu nābai nānalu vĕṭṭī yĕgasakkīm̐ḍu vīni dĕṁta nerube (||kalaḍugā||) tappujagaḍālu rem̐sī tānĕ maṁchivām̐ḍu yippuḍĕ vāvulu sĕppī yĕvagiṁcham̐ḍu muppirim̐ dala vaṁchina movidenĕ liyya vachchī sappuḍu gāguṁḍām̐ jerī jāṇa gade vīm̐ḍu (||kalaḍugā||) tamagiṁchu ninnaḍānu tagavarīm̐ dānĕ amaram̐ gadalu sĕppī naṁdu kādam̐ḍu timiri śhrīvĕṁkaḍādri devum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ samaradi ninniḍānu sarusum̐ḍu gadave