Title (Indic)కలదొక్కటే గురి కమలాక్ష నీ కరుణ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కలదొక్కటే గురి కమలాక్ష నీ కరుణ యిల నేనెట్టుండినాను యెంచకుమీ నేరమి (॥కల॥) మనసులోనికి గురి మాధవ నీ పాదాలు తనువుపై గురి నీ సుదర్శనము కనుచూపులకు గురి కమలాక్ష నీ రూపు పను లెన్నిగలిగినఁ బట్టకు నా నేరమి (॥కల॥) చేతులు రెంటికి గురి సేసేటి నీ పూజలు నీతి నా నాలికగురి నీ నామము కాతరపునుదుటికిఁ గల తిరుమణి గురి పాతకపు నావలనఁ బట్టకుమీ నేరము (॥కల॥) యిహపరాలకు గురి యీ నీ శరణాగతి సహజ మాత్మకు గురి సంతతభక్తి మహిలో శ్రీవేంకటేశ మన్నించి నన్నేలితివి బహువిధముల నింకఁ బట్టకుమీ నేరమి English(||pallavi||) kaladŏkkaḍe guri kamalākṣha nī karuṇa yila nenĕṭṭuṁḍinānu yĕṁchagumī nerami (||kala||) manasulonigi guri mādhava nī pādālu tanuvubai guri nī sudarśhanamu kanusūbulagu guri kamalākṣha nī rūbu panu lĕnnigaliginam̐ baṭṭagu nā nerami (||kala||) sedulu rĕṁṭigi guri seseḍi nī pūjalu nīdi nā nāligaguri nī nāmamu kādarabunuduḍigim̐ gala tirumaṇi guri pādagabu nāvalanam̐ baṭṭagumī neramu (||kala||) yihabarālagu guri yī nī śharaṇāgadi sahaja mātmagu guri saṁtadabhakti mahilo śhrīveṁkaḍeśha manniṁchi nannelidivi bahuvidhamula niṁkam̐ baṭṭagumī nerami