Title (Indic)కలదందే పో సర్వముఁ గలదు కామితార్థమునుఁ గలదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కలదందే పో సర్వముఁ గలదు కామితార్థమునుఁ గలదు కలదు గలదు శరణాగతులకు హరికైంకర్యంబున మోక్షము గలదు (॥కల॥) ఆకాశంబున మోక్షము వెదకిన నందులోపలా లేదు పైకొని తానెంత వెదకి చూచినా పాతాళంబున లేదు యీకడ ధరలో మూలమూలలను యెందు వెదకినా లేదు శ్రీకాంతుని మతిఁ జింతించి యాసలఁ జిక్కక తొలఁగిన నందే కలదు (॥కల॥) కోటిజన్మములు యెత్తిన ముక్తికి కొన మొదలేమియుఁ గనరాదు వాటపు సంసారములోఁ గర్మపువార్ధి యీఁదినాఁ గనరాదు కూటువతో స్వర్గాది లోకములఁ గోరి వెదకినాఁ గనరాదు గాఁటపు కేశవభక్తి గలిగితే కైవల్యము మతిఁ గానఁగవచ్చు (॥కల॥) సకలశాస్త్రములు చదివినాఁ బరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలువేల్పుల నెందరిఁ గడువెదకి కొలిచినా దొరకదు అకలంకుఁడు శ్రీవేంకటగిరిపతి అంతరంగమున నున్నాఁడనుచును ప్రకటముగా గురుఁ డానతి ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకు English(||pallavi||) kaladaṁde po sarvamum̐ galadu kāmidārdhamunum̐ galadu kaladu galadu śharaṇāgadulagu harigaiṁkaryaṁbuna mokṣhamu galadu (||kala||) āgāśhaṁbuna mokṣhamu vĕdagina naṁdulobalā ledu paigŏni tānĕṁta vĕdagi sūsinā pādāḽaṁbuna ledu yīgaḍa dharalo mūlamūlalanu yĕṁdu vĕdaginā ledu śhrīgāṁtuni madim̐ jiṁtiṁchi yāsalam̐ jikkaga tŏlam̐gina naṁde kaladu (||kala||) koḍijanmamulu yĕttina muktigi kŏna mŏdalemiyum̐ ganarādu vāḍabu saṁsāramulom̐ garmabuvārdhi yīm̐dinām̐ ganarādu kūḍuvado svargādi logamulam̐ gori vĕdaginām̐ ganarādu gām̐ṭabu keśhavabhakti galigide kaivalyamu madim̐ gānam̐gavachchu (||kala||) sagalaśhāstramulu sadivinām̐ baramu sakkaḍi mārgamu dŏragadu vigaḍabu paluvelbula nĕṁdarim̐ gaḍuvĕdagi kŏlisinā dŏragadu agalaṁkum̐ḍu śhrīveṁkaḍagiribadi aṁtaraṁgamuna nunnām̐ḍanusunu pragaḍamugā gurum̐ ḍānadi ichchina paramu sujñānamu tanalo dŏragu