Title (Indic)కడుఁ బెలుచుగుణములది గదె యమ్మ యీకొమ్మ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కడుఁ బెలుచుగుణములది గదె యమ్మ యీకొమ్మ యెడలేక ఇఁక నెంత యేలునో పతిని (॥కడు॥) పోదలఁ బుక్కిటినిండ పాలితి తములము నించి పెదవులను మాటాడెఁ బ్రియునితోడ వుదుటుగర్వము యించ నొక్క చెలిపై నొరగి కదలుఁగన్నుల నవ్వెఁగదె మరియుఁ బతిని (॥కడు॥) అచటఁ బావాలు వోయ్యారముగ మెట్టుకొని పచరించె మాటలనె పంత మితని కుచములెడఁ బయ్యఁటకొంగు వల్లెవాటు గొని రచన నొకచే మొక్కె రాజసానఁ బతికి (॥కడు॥) కొప్పువూవులు వీడి కొంతగొంత రాలఁగాఁ గప్పుచు శ్రీవేంకటేశుఁ గాఁగిలించెను దప్పిదేరుమోవితోడ తనిసీఁ దనియనిరతుల యిప్పుడే వురమెక్కె నెనయుచుఁ బతిని English(||pallavi||) kaḍum̐ bĕlusuguṇamuladi gadĕ yamma yīgŏmma yĕḍalega im̐ka nĕṁta yeluno padini (||kaḍu||) podalam̐ bukkiḍiniṁḍa pālidi tamulamu niṁchi pĕdavulanu māḍāḍĕm̐ briyunidoḍa vuduḍugarvamu yiṁcha nŏkka sĕlibai nŏragi kadalum̐gannula navvĕm̐gadĕ mariyum̐ badini (||kaḍu||) asaḍam̐ bāvālu voyyāramuga mĕṭṭugŏni pasariṁchĕ māḍalanĕ paṁta midani kusamulĕḍam̐ bayyam̐ṭagŏṁgu vallĕvāḍu gŏni rasana nŏgase mŏkkĕ rājasānam̐ badigi (||kaḍu||) kŏppuvūvulu vīḍi kŏṁtagŏṁta rālam̐gām̐ gappusu śhrīveṁkaḍeśhum̐ gām̐giliṁchĕnu dappiderumovidoḍa tanisīm̐ daniyaniradula yippuḍe vuramĕkkĕ nĕnayusum̐ badini