Title (Indic)కడు వేడుక లీడేరెఁ గాంత నీవు గలందుకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కడు వేడుక లీడేరెఁ గాంత నీవు గలందుకు తడయ కెప్పుడూ నా దండ నుండఁ గదవే (॥కడు॥) ఆతని చక్కఁదనాలు అప్పటనుండిఁ జెప్పేవు చూతము తోడితేనే సుదతి పోతరించి వచ్చేనంటే పొంచి మావా రేమందురో దూతికవు నీవే పొందులు సేయఁగదవే (॥కడు॥) వీడెమిచ్చి పంపేనంటా వెస నా చేతికిచ్చేవు జోడు గూడఁ జేయఁగదే సుదతి గోడ నిక్కిచూచేనంటా కొప్పుజారునో యేమో యీడైన చెలికత్తెవు యిద్దరిఁ గూడించవే (॥కడు॥) తెరలోనున్నాఁడంటా దిష్టముగాఁ జూపేవు సొరిదిఁ బెండ్లి సేయవే సుదతి యిరవై శ్రీవేంకటేశుఁ డితఁ డిట్టె నన్ను నేలె పరగు సంగాతివి సోబానఁ బాడఁగదవే English(||pallavi||) kaḍu veḍuga līḍerĕm̐ gāṁta nīvu galaṁdugu taḍaya kĕppuḍū nā daṁḍa nuṁḍam̐ gadave (||kaḍu||) ādani sakkam̐danālu appaḍanuṁḍim̐ jĕppevu sūdamu toḍidene sudadi podariṁchi vachchenaṁṭe pŏṁchi māvā remaṁduro dūdigavu nīve pŏṁdulu seyam̐gadave (||kaḍu||) vīḍĕmichchi paṁpenaṁṭā vĕsa nā sedigichchevu joḍu gūḍam̐ jeyam̐gade sudadi goḍa nikkisūsenaṁṭā kŏppujāruno yemo yīḍaina sĕligattĕvu yiddarim̐ gūḍiṁchave (||kaḍu||) tĕralonunnām̐ḍaṁṭā diṣhṭamugām̐ jūbevu sŏridim̐ bĕṁḍli seyave sudadi yiravai śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ ḍiṭṭĕ nannu nelĕ paragu saṁgādivi sobānam̐ bāḍam̐gadave