Title (Indic)కడవారు చెప్పితేను కడువెంగెమై వుండు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కడవారు చెప్పితేను కడువెంగెమై వుండు అడరి నీ చేతులనే అంటి చూచుకోవయ్యా (॥కడ॥) వనితచెవుల నున్న వజ్రాల కమ్మలవొత్తు - లొనర నీచెక్కులపై నున్నవి నేడు మునుకొన్నవలపుల ముద్రలవె నున్నవి తనర కు నివే యద్దము చూచుకోవయ్యా (॥కడ॥) కాంతనుదుట నున్నకస్తూరి వట్రున బొట్టు అంతలోనే నీనొసల నంటివున్నది చెంత నీరతికి నీలచ్చెన గురుతైవునది వింతగా గోర గీరి వీవే చూచుకోవయ్యా (॥కడ॥) కలికికన్నుల నున్నకాటుకరేకలు నీ పలచనికెమ్మోవి పాఁగి వున్నవి అలరి శ్రీవేంకటేశ ఆసె నన్నుఁ గూడితివి చలివాయ నీపెదవి చాఁచి చూచుకోవయ్యా English(||pallavi||) kaḍavāru sĕppidenu kaḍuvĕṁgĕmai vuṁḍu aḍari nī sedulane aṁṭi sūsugovayyā (||kaḍa||) vanidasĕvula nunna vajrāla kammalavŏttu - lŏnara nīsĕkkulabai nunnavi neḍu munugŏnnavalabula mudralavĕ nunnavi tanara ku nive yaddamu sūsugovayyā (||kaḍa||) kāṁtanuduḍa nunnagastūri vaṭruna bŏṭṭu aṁtalone nīnŏsala naṁṭivunnadi sĕṁta nīradigi nīlachchĕna gurudaivunadi viṁtagā gora gīri vīve sūsugovayyā (||kaḍa||) kaligigannula nunnagāḍugaregalu nī palasanigĕmmovi pām̐gi vunnavi alari śhrīveṁkaḍeśha āsĕ nannum̐ gūḍidivi salivāya nībĕdavi sām̐si sūsugovayyā